విష్ణుద్వేషి
ఐన హిరణ్యకశిపుడు నరుడిచేతకానీ, మృగంచేతకానీ; రాత్రికానీ, పగలుకానీ;
నేలపైనకానీ, ఆకాశంలోకానీ; ఏ ఆయుదం చేతకానీ సంహరించబడకుండా ఉండాలని వరం
పొందుతాడు. అతని కుమారుడు ప్రహ్లాదుడు పరమ భక్తుడు. అతడిని తండ్రినుంచి
రక్షించడానికి రాత్రీపగలూకాని సాయం సంధ్యవేళలో, సగంమృగంగా, సగంమనిషిగా
అవతరించి, గడపమీద కూర్చొని, హిరణ్యకశిపుడిని తనవొడిలో పెట్టుకొని, పదునైన
గోళ్ళతో సంహరించిన ఉగ్రనరసింహుడికి అడుగడుగునా గుడులున్నాయి. వాటిలో
తూర్పుగోదావరి జిల్లా కోరుకొండలో ఉన్న లక్ష్మీ నరసింహస్వామి గుడి చాలా
ప్రాచీనమైనది. కోరుకొండ కాకినాడనుంచి 60 కిలోమీటర్లు, రాజమండ్రీకి 20
కిలోమీటర్ల దూరంలో ఉంది. కొండమీద వెలసిన లక్ష్మీనరసింహ స్వామి శాంతమూర్తి.
సముద్రమట్టానికి 120 మీటర్ల ఎత్తులో దేవాలయం ఉంది. సుమారు 700 మెట్ల మీదుగా
పైకి వెళ్ళాలి.కోరుకొండ క్షేత్రంలో రెండు ఆలయాలు ఉన్నాయి. కొండ దిగువన ఒకటి, పైన ఒకటి. పైన స్వయంభూగా వెలసిన మూర్తి. ఈ విగ్రహం కేవలం ఒకటిన్నర అంగుళాలు మాత్రమే ఉంటుంది. కొండ దిగువన ప్రతిష్ఠించబడిన మూర్తి.
క్రీస్తుశకం 12వ శతాబ్ధంలో రెడ్డిరాజులు ఈ దేవాలయం నిర్మించారు. విశిష్ఠాద్వైతాన్ని ప్రభోధించిన రామానుజుని ప్రధాన శిష్యుడు, తమిళనాడులోని అతి ప్రాచీనమైన శ్రీరంగపట్టణం దేవాలయంలో అప్పటి వైష్ణవ ప్రధాన అర్చకుడిగా ఉన్న పరాశర్ భట్నాగర్ని ప్రత్యేకంగా కోరుకొండ తీసుకొనివచ్చి ప్రతిష్ఠ చేయించారు.