శ్రీ వల్లీ సమేత సుబ్రహ్మణ్యస్వామి
సుబ్రహ్మణ్యస్వామికి,
లక్ష్మిదేవి కుమార్తె అయిన శ్రీవల్లీదేవితో వివాహం చెయ్యాలని పార్వతిదేవి
మనసు పడిందట. బుద్ధిమంతురాలు, మహాసౌందర్యవతి, పైగా సంపదల తల్లి తనయ
శ్రీవల్లి.
ఆ విషయమే తన భర్త అయిన శివభగవానుడితో చెబితే ఆయన నవ్వి
ధ్యానంలోకి వెళ్ళిపోయాడట. దాంతో పార్వతి లక్ష్మిదేవితో విషయం కదిలించింది. ’
మా అమ్మాయిని మీ ఇంటి కోడల్ని చేస్తే మా అమ్మాయికి లభించేదేముంది?
మంచుకొండ, రుద్రాక్షమాలలు, ఇంత విభూది తప్ప ’అని పెదవి విరిచేసరికి,
పార్వతిదేవి కన్నీటి పర్యంతమై శివునికి విషయం చెప్పి విచారించింది.
అప్పుడు
శివుడు తన ఒంటిమీది ఓ రుద్రాక్షనిచ్చి ’ఈ ఎత్తు బరువు తూగే బంగారాన్ని
ఇమ్మని అడుగు’ అని పంపిస్తాడు. పార్వతిదేవి శివుడిచ్చిన రుద్రాక్షతో
లక్ష్మిదేవిని కలిసి, తన వచ్చిన పని చెబుతుంది. లక్ష్మిదేవి ఆ రుద్రాక్షను ఓ
త్రాసు తెప్పించి తూచాలని చూసింది, తన ఒంటిమీది ఆభరణాలేకాదు, తన సంపదనంతా
వేసి తూచినా ఆ రుద్రాక్ష తూగక పోయేసరికి ఆ సంపదల తల్లి ఖిన్నురాలైపోతుంది.
’ఇంకా
ఇలాంటి రుద్రాక్షలు నా స్వామివద్ద ఎన్నో వున్నాయి’ అని పార్వతి అనేసరికి
పశ్చాత్తాపం చెంది తన కుమార్తెను షణ్ముఖునికిచ్చి వివాహం చేస్తుంది. ఆ
తర్వాత దేవసేన అనే మరొ యువతితో కూడా సుబ్రహ్మణ్యేశ్వరుని వివాహం
జరుగుతుంది.