సద్విషయ సంగ్రహము.
వేద విభాగము చేసి వాటికినాకరణంచేసిన మహర్షి వ్యాసులవారు. దైవాంశ సంభూతులైన వీరిని, వేద వ్యాస మహర్షి అని అంటారు.
ఈ వేదార్థములను గ్రహించుటకు, సామాన్య మానవులక కష్టమని మరలా
వీరే వేదార్థములతో, సృష్ట్యాదిగా జరిగిన సంఘటనలను కథారూపములో
అష్టాదశ (18) పురాణములుగా నిర్మించి బోధించినారు.
ఈ పురాణములను లోకానికి ప్రకటించినది, సూతమహర్షి.
ద్వాపర యుగాంతమందు, నైమిశారణ్యమందు చేయబడుచున్న సత్రయజ్ఞమందు
పాల్గోన్న శౌనకాది మహామునులు మరియు వారి అనుయాయులైన 88 వేలమంది ఇతర ఋషులు కోరగా , 12 సంవత్సరములకాము,నిరంతరము
సూతమహర్షి పురాణ ప్రవచనముచేసినారని చెప్పబడినది.
ఆ కాలమందు, జంబూద్వీపము,భరతవర్షము, భరతఖండమునందున్న
చిన్నచిన్నదేశములు, మహానగరములు దాదాపు120 ఉన్నవని
వివిధపురాణమువలన తెలియ వచ్చుచున్నది. బహశా 12.సం. కాలములో
88 వేలమంది, ఋషులు, సాధువులు, సన్యాసులు ఆ సత్రయాగమును చూచుటకు వెళ్లుయుండవచ్చును.
నేటికిని ఎందరో మహనీయులు,దైవదత్తమై తమ ఆధ్యాత్మిక విజ్ఞానముతో
పురాణ,ఇతిహాస, వేద,వేదాంత విశ్లేషణ చేయుచూ, జ్ఞానగంగా ప్రవాహ స్వరూపులై
జిజ్ఞాసులైన శ్రోతలను ప్రత్యక్షముగాను, పరోక్షముగాను మంత్రముగ్ధునుగావించుట
మనముచూచునేయున్నాము.నిస్సందేహముగా వీరందరూ వ్యాసాంశ సంభూతులే!
ఉదాహరణకు:- యోగీశ్వరులు, జగద్గువులు శ్రీ శ్రీ శ్రీ సిధ్ధేశ్వరానంద బారతీ మహాస్వాములవారు ఇంకను ఎందరో ప్రజ్ఞా ధురీణులైన యతీశ్వరులు.
బ్ర.శ్రీ . చాగంటివారు, బ్ర.శ్రీ, .సామవేదం షణ్ముఖ శర్మగారు.
ఇంకనూ ఎందరో మహనీయులు వారందరికి వందనములు.
ఇంకావుంది.
రేపటి విషయము. పురాణ ఇతిహాసములందు చెప్పడిన 101 ప్రసిధ్దపుణ్యక్షేత్రములు.
శుభం భవతు...
సద్విషయ సంగ్రహము
పురాణ, ఇతిహాస,శ్రీమహా భారత, రామాయణాదులలో వివరింపబడిన
ప్రసిధ్ధ పుణ్యక్షేత్రములు.దైవశక్తి ప్రసరించు దివ్య స్థలములు.
1.అమరనాథ్ హిమాలయపర్వతములలో- దేవత అమరనాథుడు.(గుహలో ప్రతిసంవత్సరము ఏర్పడు మంచులింగము)
2.కేదారనాథ్ ఇదికూడా హిమాలయములలో --- కేదారేశ్వరుడు.మందాకిని నది.
3.బదరీనాథ్.ఇదికూడా హిమాలయములలో-దేవత.నరనాయణులు.అలక్ నందా.
4.హరిద్వారం. హిమాలయాల ముఖద్వారం.-- దేవత. గంగాదేవి (నది)
5.హృషీకేశ్ . హిమాలయాలప్రారంభము.--- శుధ్ధగంగా (నది)
6.జాలంధరపీఠం.-విశ్వముఖీదేవి. 7.జ్వాలాముఖిక్షేత్రం. -దేవత జ్వాలాముఖిదేవి
8.కురుక్షేత్రం(మహాభారతసమరంజరిగినచోటు)
దేవత-స్యమంతపంచకతీర్థం(తటాకం) సూర్యగ్రహణ మందు ప్రాముఖ్యత.
9.మథురా - దేవత. ద్వారకానాధుడు(శ్రీకృష్షుడు) వసించిన ప్రదేశము.
10.బృందావనము.దేవత- రాధాలోలుడు రమ్య రాసకేళీ విహార ప్రదేశం.
11.నైమిశారణ్యము.దేవత-సుదీర్ఘ సత్రయాగము, సూతపౌరాణికునిచే,భారత, భాగవత,అష్టాదశ పురాణ ప్రవచనంజరిపినస్థలం. అరణ్య తీర్థములు, నది.
12.ప్రయాగ.గంగా, యమునా, సరస్వతి త్రివేణి సంగమము.శ్రీ లలితా శక్తి పీఠం.
13.చిత్రకూటం.ఒక పర్వతం. దేవత- అరణ్యవాసమునకేగుచున్న రాముని భరతుడు కలుసుకొని, రాముని,రాజ్యము స్వీకరించమని ప్రాధేయ పడిన స్థలము.
14. కాశి (వారణాశి) వరుణ, అస్సీ నదుల మధ్యనున్న అవిమక్త క్షేత్రము, శివుడ
శాశ్వతముగా నివసించెదనని వాగ్ధానముచేసి,నివసిచుచున్న దివ్య క్షేత్రము
దేవతలు- విశ్వనాథుడు (జ్యోతిర్లింగము) అన్నపూర్ణావిశాలాక్షి,డుండివినాయకుడు
క్షేత్ర పాలకుడైన కాలబైరవుడు. కాశివాసుల పాప శోధకుడు,భుక్తి,ముక్తి ప్రదుడు.
15. వాధ్యాచలం. (మీర్జాపూర్)దేవత - వింద్యవాసిని దుర్గా పరమేశ్వరిమాత.
16. అయోధ్య. దశరథమహారాజు రాజధాని.శ్రీరాముని(అవతారం) జన్మక్షేత్రం.
17.
మిథిలా(నగరం) జనకుని రాజధాని. సీతాదేవి పుట్టినిల్లు.శివధనుస్సును విరిచి
సీతాదేవిని స్వయంవరంలో స్వీకరించి,మనువాడిన పుణ్య క్షేత్రం.
18. గయా.
(గయాసురసంహారమైనప్రదేశం) దేవత- విష్ణుపదం. సమస్త వైదిక సాంప్రదాయులు, తమ
పితృ దేవతలకు, శాశ్వత పుణ్యలోక ప్రాప్తికోకు, పిండ ప్రదానము చేయు
పుణ్యక్షేత్రము. అక్షయవటము. ఫల్గుణినది.
19. వైద్యనాథ ధామ్. ( దేవఘర్) వైద్యనాథ జ్యోతిర్లింగము. ( ఆరోగ్యప్రదము)
20.కాళీఘటము ( కలకత్తా) దేవత - కాళికాదేవి.గంగానది.(తాంత్రిక పూజాక్షేత్రం)
ఇంకావుంది.
సద్విషయ సంగ్రహము
పురాణ, ఇతిహాస,శ్రీమహా భారత, రామాయణాదులలో వివరింపబడిన
ప్రసిధ్ధ పుణ్యక్షేత్రములు.దైవశక్తి ప్రసరించు దివ్య స్థలములు.( భాగం.2)
------------------------------------------------------------------------
21. కామాఖ్య (అష్టాదశశక్తి పీఠాలలోనిది) అస్సాము రాజధాని, గౌహతి వధ్ద నీల
పర్వతంమీద ఉనన్నది. దేవత:-కామఖ్య(కామాక్షి) ఈ క్షేత్రముయొక్క ప్రశంశ
దేవీభాగవతంలో
ఉన్నది.( తంత్రోక్త దశమహావిద్యల ఆలయములు ఈ పర్వతముమీద వున్నాయి.) ఈ
క్షేత్రములో ప్రతినిత్యము జంతుబలుల ఇవ్వబడతాయి( మద్య, మాంస,మైరేయాదులతో
రాత్రికాలమందు తాంత్రికహోమములు జరుగుచుండును.)
22.భువనేశ్వరం (ఏకామ్రం) దేవత- లిగరాజు. భువనేశ్వర్ ఒడిస్సాలోఉన్నది.
23.పురిజగన్నాధము. దేవత జగన్నాధ, బలభద్రాదులు. ఈ క్షేత్రమునుగురించి
భవిష్య పురాణములో ప్రశంశ వున్నది. ఒడిస్సా లో సముద్ర తటమందున్నది.
24.ఉజ్జయిని. (ద్వాదశ జ్యోతిర్లింగ,మరియు శక్తిపీఠ క్షేత్రము) ఉజ్జయినిక్షేత్రం
అనాదిగా
ప్రసిధ్ధిగలక్షేత్రం. దీనికి అవంతి,కుశస్థలి,కుముద్వతి మొదలైన
పేర్లున్నాయి.దేవర-ఈశ్వరుని మహాకాలేశ్వరుడు అంటారు. దేవత -మహాకాళి.
25. అమరకంటకం. నర్మదానది (ఉత్పత్తి స్థానం) మధ్య ప్రదేశ్ లో ఉన్నది.
26.ఓం కారేశ్వరం, అమలేశ్వరం. ఊరుపేరు ఓంకారేశ్వర్. నర్మదానదికి, ఇరువైపులా వున్న ప్రాచీన శైవక్షేత్రం ( ద్వాదశ జ్యోతిర్లింగక్షేత్రం)
27.త్ర్యంబకం (నాసిక్) గోదావరి నది ఉత్పత్తి స్థానము, పంచవటి. మహారాష్ట్ర
28.త్ర్యంబకేశ్వరం. దేవర -త్ర్యంబకేశ్వరుడు. (జ్యోతిర్లింగ క్షేత్రము) ''
29.భీమశంకరం (ఢాకిని) దేవర - భీమశంకరుడు. అరణ్య పర్వత సానువులలోఉన్నది.(జ్యోతిర్లింగ క్షేత్రము) ఈ స్వామిని, భూత,పిశాచాదులచేత
గూడా పూజింబడునని స్త్రోత్రములో చెప్పబడినది.
30. మహాబలేశ్వరం. దేవర. మహాబలేశ్వరుడు. తూర్పు సముద్ర తటమందున్నది. మామల్లపురం.తమిళనాడు.
31. పండరాపురము. దేవర, దేవత- పండరీనాథుడు(విఠ్ఠల) రుక్మిణీ.భీమానదీ తీరమునందున్న వైష్ణవ క్షేత్రము.దర్శన స్పర్శనములు అందరికి సమానము.
32. కరవీరపురము (కొల్హాపురం) దేవత- మహాలక్ష్మీ. (శక్తిపీఠక్షేత్రము) ఇక్కడనే
శ్రీనివాసుడు 12.సంవత్సరములు,అలిగి వెళ్ళిన భార్య లక్ష్మీదేవి కొరకు తపస్సుచేసినాడని, వేంకటాచలమహాత్యములో ఉన్నది.
ఇంకాఉన్నది.