7. బీజహారిణి :
స్త్రీ పురుషుల యందుండు శుక్ర శోణితములలో గల సంతాన బీజములను నాశనము
చేయును. విత్తనములలో జేరి వానియందు మొలకెత్తు శక్తిని పోగొట్టును.
వ్రతములు, అన్నదానములు మొదలగు దాన ధర్మముల వలన ఈ పీడ పరిహారమగును.
8.విద్వేషిణి : ఇది దంపతుల మధ్యచేరి ప్రతిదినము కలహములు పుట్టించుటకు ప్రయత్నించును. దేవతారాధనములు, బ్రాహ్మణ భోజనములు జరిపించినచో ఇది శాంతించును.
ఈ పదునారుగుకిని సంతానము ఉన్నది.వారందరును ప్రజలకును అందులోను అనాచార వంతులకును, ధర్మము నాచరింపని వారికి కీడు చేయుచుందురు.
అష్టమూర్తి మహేశ్వరుడు
బ్రహ్మదేవుడు సృష్టి చేయుటకు సంకల్పము చేసి, తనకు తోడుగా ఇంకను ఎవరైన ఉన్నచో ఈ కార్యము విస్తృతముగా సాగునుగదాయని అలోచించెను. ఆ సంకల్పబలము చేత నీలలోహిత వర్ణము (వయొలెట్ కలరు) గలరుడ్రుడను వాడు పుట్టి యేడ్చుచుండెను. ఎందుకేడ్చు చున్నావని యడుగగా తనకు పేరు పెట్ట లేదేమానెను. బ్రహ్మ నీకు పేరు లేక పోవుటేమి? ఎనిమిది పేర్లు నీకున్నవి. భవుడు, శర్వుడు, ఈశానుడు, పశుపతి, రుద్రుడు, ఉగ్రుడు, భీముడు, మహాదేవుడు ఈ పేర్లున్నియు నీవేయని చెప్పెను. అతడు నీరు, నిప్పు, గాలి, భూమి, ఆకాశము, సూర్యుడు, చంద్రుడు, యజ్ఞ దీక్షితుడు అనురూపములతో ప్రకాశించుచుండెను. అతడు దక్ష ప్రజాపతి కుమార్తె సతీదేవిని పెండ్లి యాడెను. ఆమె, తండ్రి చేసిన అవమానమును భరింపలేక యోగాగ్నిలో దన శరీరమును కాల్చివేసికొనెను. ఆ కోపముతో రుద్రుడు దక్షయజ్ఞము ధ్వంసము చేసెను. ఆ సతీదేవి తిరిగి హిమవంతుని గర్భమున పార్వతిగా జనించెను. మహేశ్వరుని భర్తగాకోరి మహాత వస్సుచేసి ఆయన అనుగ్రహము సంపాదించి పెండ్లాడెను.
మనువులు - మన్వంతరము
బ్రహ్మమాన సపుత్రుడైన స్వయంభువు అనునతడు మొదటి మనువు. అతడు శతరూపము పెండ్లి యాడి సృష్టిని విస్తరింపజేయుటలో తండ్రికి తోడ్పడెను. అతనివలన వెలసిన రాజవంశములు చాల ఉన్నవి.

No comments:
Post a Comment