ఉమాదేవి
(కాళిదాసు కుమారసంభవమునకు మూలకథ)
పూర్వము నిశంభుడను రాక్షసుడు దేవతలను చాలా బాధలు పెట్టుచుండగా వాని పీడ తొలగించుకొనుటకై వైకున్తమున నున్న శ్రీమన్నారాయణుని యెద్ద కేగిరి. అతడు వారితో, "అగ్నిష్వాత్తులను పితృదేవతలకు "మేన" యను కుమార్తె యున్నది. ఆమెను హిమవంతునికి ఇచ్చి పెండ్లి చేయుటకు మీరందరును ప్రయత్నింపుడు. మేనా హిమవంతుల గర్భమున పార్వతి (ఉమ ఉద్భవించును). పూర్వము తండ్రిచేత అవమానితురాలై శరీరమును విడిచిన సతీదేవియే పార్వతిగా జన్మించును. పార్వతిని శంకరుడు వివాహమాడినచో వారిరువురకును జన్మించెడి కుమారుడు ఈ నిశుంభుని తారకాసురునితో సహా సంహరించగలడని " చెప్పెను. దేవతలట్లే ప్రయత్నించి, మేనాహిమవంతులకు వివాహము గావించిరి.
వారికి మొదట సునాభుడను కొడుకు పుట్టెను. ఆ తరువాత కుటిల, రాగవతి, కాళియను ముగ్గురు కూతుళ్ళు పుట్టిరి. వారు హిమవంతుని యింట దినదిన ప్రవర్ధమానమై యుక్తవయసు కలవారైరి. ఒకసారి దేవతలు కుటిలను దీసికొనిపోయి బ్రహ్మముందట నిలబెట్టిరి. "పరమేశ్వరునికి పత్ని యయ్యెడిది ఈమెయేనా?" అని అడుగగా అతడు, "ఈమెకాదు" అనగా కుటిల " నే నెందుకు ఈశ్వరుని భార్యను కాలేను? అవసరమైనచో తపము చేసియైన శివపత్ని నగుదును. నీవు చెప్పెడిదేమి?" అని బ్రహ్మను ధిక్కరించి మాటాడెను. అందువల్ల బ్రహ్మా కోపించి "నీవు కుటిలవు గనుక జలప్రవాహములలో నుండి వంకరటింకరలు గలిగించుచుండుము" అని శపించెను. ఆమె నీటి ప్రవాహములలో గలిసిపోయెను. అందుకే జల ప్రవాహములు చాలా వంకలు దిగి పారుచుండును.
దేవతలు మరలా రాగవతి (రాగిణి) ణి దెచ్చి, "ఈమె శంకరుని భార్య యగునా" యని యడుగగా, బ్రహ్మ, ఈమె
No comments:
Post a Comment