Wednesday, July 2, 2014

మహాశివరాత్రి







ప్రతి సంవత్సరము మాఘ బహుళ చతుర్దశి రోజున మహాశివరాత్రి పర్వదినము జరుపుకొంటారు. మహాశివరాత్రి రోజున శ్రీ పరమేశ్వరుడు లింగాకారుడుగా ప్రతి దేవాలయములో కనిపిస్తాడు. అట్టి శివునకు అభిషేకములు, పూజలు ఆ రోజు జరిపినచో శివ సన్నిధానమునకు చేరుదురని భక్తుల విశ్వాసము. ఈ రోజున భక్తులు ఉపవాసముండి, శివునికి పూజలు నిర్వహించి భక్తి పాటలు, భజనలతో రాత్రి నిదురించ కుండా  జాగరణ చేయుదురు. శివరాత్రి రోజున ఒక్క బిల్వపత్రమైనను శివునికి సమర్పించినచో జన్మరాహిత్యము, ముక్తి కలుగునని శివభక్తుల నమ్మకము. ఆ పర్వదినమునందు శివలింగము జ్యోతిర్లింగముగా వెలుగొందుతుంది. మన భారత దేశములోని కాశ్మీరు ప్రాంతములో ఈ శివరాత్రి ఉత్సవములను 15 రోజులు నిర్వహిస్తారు.
శివుడు లింగ రూపదారుడుగా శివరాత్రి నాడు అర్దరాత్రి 12.30 నిముషములకు ఉద్భవించాడని సాధువులు, పండితులు మొదలైన పెద్దలవల్ల తెలుపబడినది. కార్తీకమాసములో మొదలైన చలి శివరాత్రి తో శివ శివ అంటూ ముగుస్తుందని పెద్దల మాట. ప్రతి శివాలయములోను ఆలయ పండితులు రుద్ర నమకం, చమకం పఠిస్తారు. శివునకు ప్రీతికరమైన అభిషేకములు, పంచామృతాభిషేకములు నిర్వహిస్తారు. ఈ పర్వదినమున ప్రత్యేకించి మహాన్యాసము మొదలైన శివుని శక్తివంతమైన పూజలు నిర్వహిస్తారు. అనేక శివాలయములలో స్పటిక లింగములు కూడా వున్నవి. శ్రీ పరమేశ్వరునకు ప్రీతి  పాత్రమైన బిల్వ దళ ములను ఆయుర్వేద వైద్యమునందు ఉపయోగించెదరు.మెదడు, జీర్ణావయవాలు, మూత్రావయవాలకు సంబందించిన వ్యాధులు ఈ బిల్వ పత్రాల ద్వారా నయము చేయవచ్చునని వైద్య శాస్త్రజ్ఞుల అభిప్రాయము. ఈ పత్రముల ద్వారా ఇంకా అనేక రకములైన శారీరక బాధలను కూడా నయము చేయ వచ్చునని విజ్ఞాన శాస్త్రజ్ఞుల అభిప్రాయము.
ఉపవాసమనగా ఈ రోజున భోజనాదులు చేయకుండా(అన్నము,నీరు తీసుకోక ) రోజంతా శివుని స్మరించుటలో గడపవలెను. ఇలా ఉపవసించి ఆ రాత్రి నిద్ర చేయకుండా జాగరణ చేయవలెను. జాగరణ చేయుటలోని అర్ధమేమనగా పేరులోని రోజులో అర్ధ భాగమైన ' రాత్రి ' ని కలిపి శివరాత్రి అని అనుచున్నాము. అనగా అన్ని రాత్రుల కంటే ఈ రాత్రి చాలా ప్రాముఖ్యమున్నది.శివ భగవానుడు రాత్రి సమయమున లింగరూపములో ఉద్భ వించినాడు(అనగా పుట్టినాడు)


No comments:

Post a Comment