శ్లో|| శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే
సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే ||
తా || శ్రీరామనామము రమ్యమైనది .మనస్సును రంజిమ్పచేయునది .ఒక్కసారి పలికిన వెయ్యి మారులు పలికినంత పుణ్యము కలిగించునది ఈ రామనామము .
సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే ||
తా || శ్రీరామనామము రమ్యమైనది .మనస్సును రంజిమ్పచేయునది .ఒక్కసారి పలికిన వెయ్యి మారులు పలికినంత పుణ్యము కలిగించునది ఈ రామనామము .
శ్లో || ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం
లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం ||
తా || ఆపదలను తొలగించి ,సర్వ సంపదలను కలిగించి ,ఎల్ల లోకములకు ప్రియము చేకూర్చునట్టి శ్రీ .రామునికి మరల మరల నమస్కరించుచున్నాను
ప్రతి సంవత్సరమందు చైత్ర శుద్ధ నవమి నాడు సీతారాము లు వెలసినటువంటి పుణ్యక్షేత్రమైన భద్రాచల క్షేత్రములో శ్రీరామనవమి రోజున శ్రీ సీతారామ కళ్యాణ మహోత్సవము ను ఎంతో వైభవముగా నిర్వహింతురు.
శ్రీరామనవమి రోజున దేవాలయములలో సీతారామ కళ్యాణము అతి వైభవముగా జరుపుదురు. శ్రీరామనవమిని పండుగగా జరుపుకొనుట మన హైందవ సాంప్రదాయము.భద్రాచాలములోని శ్రీరామునికి ప్రతి యేటా ముత్యాల హారములు ,పట్టు వస్త్రములు సమర్పించుట మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సాంప్రదాయము.ఈ మహోత్సవము యొక్క ప్రాశస్త్యము క్రింద ఉదహరించబడినది.
ప్రాచీన సాంప్రదాయము ననుసరించి, శ్రీరామనవమి రోజున కొన్ని వీధులందు,వాడలందు తాటాకు పందిళ్ళు వేసి దంపతులు పీటలపై కూర్చొని శ్రీ సీతారామ కళ్యాణము జరిపిస్తారు.కళ్యాణము అయిన వెంటనే పానకము, వడపప్పు, మొదలగు ప్రసాదములు అందరకు పంచుతారు.శ్రీరామనవమికి 5 రోజుల ముందునుండి గాని, 9 రోజుల ముందునుండి గాని భజనలు,కచేరీలు, నాటకాలు మొదలైన కార్యక్రమాలు జరుపుతారు.
శ్రీమహావిష్ణువు త్రేతాయుగమునందు శ్రీరామునిగా అవతిరించెను. శ్రీమహాలక్ష్మియే రామపత్ని సీత.ఇతని తమ్ముళ్ళు లక్ష్మణుడు, భరతుడు,శ త్రుఘ్నుడు. సాక్షాత్తు శివుని అవతారమైన ఆంజనేయుడు శ్రీరామునిబంటు.
No comments:
Post a Comment