శుక్రాచార్యుడు నవ్వి ,'నాయనా ! బృహస్పతి కుమారుడ వైనందుకు నీకు ఇన్ని ఆలోచనలు కలుగుటలో ఆశ్చర్యము లేదు . ఏ విద్య కోసము నీవు నా వద్దకు శిష్యుడుగా వచ్చితివో ఆ విద్య నీకు లభించుచున్నది .రాక్షసులు తమకు తెలియకుండ గనే నీకు ఈ విషయములో సహకరించినారు. శ్రద్ధ గల వాడవై మృత సంజీవనిని గ్రహింపుము. నీవు బయటకు వచ్చి నన్ను బ్రతికింపుము " అనుచు తన కడుపులో నున్న కచునికి మృత సంజీవనీ విద్యనుఉపదేశించెను. కచుడు శుక్రుని ఉదరమును చీల్చుకుని బయటకు రాగా శుక్రుడు మరణించెను . తాను నేర్చిన మృత సంజీవనీ విద్యతో కచుడు శుక్రుని బ్రతికించెను. దేవయాని పరమానంద భరితు రాలైనది . శుక్రుడు "ఇంక నీవిక్కడ నున్నచో ,రాక్షసులు నిన్నుబ్రతుకనీయరు. నీకు సకల విద్యలును నాయనుగ్రమున లభించును .వెళ్లి రమ్ము " అని ఆశీర్వదించి పంపెను. కచుడు శుక్రాచార్యునకు పాదాభి వందనము చేసి బయలు దేరుచు ,దేవయానికి కూడా ,నేను స్వర్గ లోకమునకు వెళ్ళుచున్నాను .సెలవిమ్ము 'అని చెప్పెను. ఆమె అదిరిపడి ,"ఓ సుందరుడా ! రాక్షసుల వల్ల చనిపోయిన నిన్ను ఇన్నిసార్లు బ్రతికించుటకు నేను పడిన పాట్లు నీకు తెలియవా ? ఇప్పటికైనను నా మనసేమిటో నీకు తెలియ లేదా ! నన్ను పెండ్లి చేసుకుని నీతో పాటు నన్ను గూడా నీ యింటికి తీసుకొని పొమ్ము " అని యడిగెను. కచుడు ,"సోదరీ ! నీవు ఇట్లు మాట్లాడుట అనుచితము .నీవు నాకు గురు పుత్రికవు .అంతేకాదు నీవును నేనును సహొదరులము .మన మధ్య ఇట్టి బాంధవ్యము పనికి రాదు " అని చెప్పగా దేవయాని కోపించి ,నీవు మా తండ్రి దగ్గర నేర్చిన మృత సంజీవనీ విద్య నీకు ఉపయోగింపక పోవుగాక "అని శపించెను . కచుడు కూడా ఆమె తనను అన్యాయముగా శపించిన దను రోషముతో , "నీవు నన్ను అక్రమముగా శపించితివి .ఈ విద్య నాకు పనిచేయక పోయినను ,నావలన నేర్చుకున్న వారికి పనిచేయును లెమ్ము .నీవీ అక్రమమునకు పాలుపడినందుకు నీకు బ్రాహ్మణేతరుడు భర్త యగు గాక 'అని తిరిగి శపించి తన లోకమునకు పోయెను .ఆ శాప ప్రభావముచే తనే దేవయానిని యయాతి మహారాజు వివాహ మాడెను.
కచుడు ,స్వర్గాలోకమునకు వెళ్లి తాను నేర్చిన మృత సంజీవనీ విద్యను దేవతలకు ఉపదేశించెను . దేవతలందరున ఆనందించిరి . ఒకప్పుడు కీడు గూడా మంచిగా పరిణ మించును గదా !
అగస్త్యుని జననము
విష్ణువు యొక్క అంశలతో పుట్టిన నర నారాయణులనెడి మునీంద్రులు బదరి కాశ్రమమున తపము చేసి కొనుచుండిరి. వారు చేయుచున్న తపమును జూచి మహేంద్రుడు భయపడి వారి తపమును చేద గొట్టుటకై కొందరు అప్సరస స్త్రీలను పంపినాడు .వారు అనేక నృత్య గీతాదులతో నరనారాయణుల తపము పాడు చేసి వారిని తమ వశము చేసికొనుటకు ప్రయత్నించిరి . మునులు వారికి వశులు కాలేదు .
No comments:
Post a Comment