Thursday, July 3, 2014

ఉగాది






ఉగాది ఉగాది(యుగాది) పండుగ చైత్ర మాస శుద్ధ పాడ్యమినాడు వచ్చును.ఉగాది అనగా యుగాది అంటే యుగము యొక్క మొదటి రోజు అని అర్థమున్నది .ఉగాది అని కాలక్రమేణా ఉచ్చరించుట జరిగినది.ఇది ముఖ్యముగా తెలుగు సంవత్సరాది తెలుగు సంవత్సరమునకు మొదటి రోజున ఈ పండుగ ను ఆచరిస్తారు.ఈ పండుగ రోజున పంచాంగ శ్రవణము చేయుట ,షడ్రుచులతో కూడిన ఉగాది పచ్చడి ని భుజించుట ప్రశస్త్యమైనది మరియు ముఖ్యమైనది.
ఉగాది పండుగ రోజున ప్రతి ఒక్కరు ప్రాతః కాలముతోనే లేచి కాలకృత్యములు నెరవేర్చి,తీపి,పులుపు,ఉప్పు,చేదు,కారం,వగరు మొదలగు ఆరు రుచులతో కూడిన ఉగాది పచ్చడి ని స్వీకరించిన పిదప నే ఇంకేదైనా ఆహారమును స్వీకరిస్తారు.ఈ పద్ధతి ప్రకారం ప్రతి వ్యక్తి జీవితం లో ఆరు విధాలైన అనుభవములను కలిగి ఉంటాడని పరమార్థం.ఈ విధమైన తత్వాన్ని పంచాంగం భోధిస్తుంది.ఇంతే గాక పంచాంగ శ్రవణంచేయుట వలన ఆయుష్షు ,ధనము,ఐశ్వర్యము వృద్ది పొందుతాయి.ప్రతి దేవాలయములోనూ పూజలు మొదలగు నవి నిర్వహించి సంధ్యవంధనంలో పండితులైన సిద్దాంతులు కొంత మంది పంచాంగం యొక్క ప్రాశస్త్యమును గూర్చి వివరిస్తారు.దీని వలన దేశ కాలమాన పరిస్థితులు ఎప్పుడు ఎ విధంగా ఉంటాయో తెలుస్తాయి.ప్రతి వ్యక్తి యొక్క జాతక చక్రమును పండితులైన వారు జ్యోతిష శాస్త్ర ప్రవీణులు ఇందు వివరించిన విధంగా తెలుసుకోవడం జరుగుతుంది.
ఇంకా గ్రహ దోషముల గూర్చియు,వాటికి శాంతి చేయువిధానం గూర్చియు తెలుసుకొనే అవకాశం ఈ పంచాంగ శ్రవణం వల్ల కలుగుతుంది.ఇంతేగాక ఇందులో దేశ ఆర్ధిక రాజకీయ పరిస్థితులు,రాజకీయ నాయకుల ప్రతిభను కూడా ముందుగానే తెలుసుకొనే అవకాశం వుంటుంది.ఈ విధంగా ఆయా సంవత్సరాలలోని ప్రతిరోజు యొక్క తిథి ,వార,నక్షత్ర ఫలితాలతో గూడి మంచి,చెడు విషయ వివరణలతో కూడియున్న పంచాంగం యొక్క ఆవశ్యకత ఈ ఉగాది పండుగ ప్రత్యేకంగా తెలియజేస్తుంది.
పంచాంగ శ్రవణం చేసిన ఈ విధానమైన పుణ్యము కలుగునని పెద్దలు చెప్పుదురు.మంగలప్రధములగు గుణములకు నిలయమైనది,శత్రువులను దుస్స్వప్న దోషములను హరించు మార్గము,శుభాకాలములను సుచిన్చునట్టిది.గంగామున్నగు మహానదులలో పుణ్యర్తము స్నానాదులు చేసిన ఎంత పుణ్యము లబించునో పంచాంగ పతనమును లబించినచో అంత పుణ్యము లభించును.గోదానది దానముతో సమానమైనది.ఉత్తమ స్మార్తది మహాక్రతువులు ఆరంభాది నిర్ణయాల ఫలములను నిరుపించునట్టి సంతాన సంపత్తు నానావిధ కార్యాల ద్వారా శుభాన్ని ఇచ్చునట్టిది.అలాంటి తిథి,వర,నక్షత్ర కరములనేడి వాటితో కూడిన పంచాంగము జనులకు మంచి సాధనము,సముచితమైనది.


No comments:

Post a Comment