Tuesday, July 15, 2014

శ్రీ భవిష్య (కలికి) పూరాణము7




మ్లేచ్చభటులు రాజును మంత్రిని, గురువును దీసికొనిపోయి స్మశానములో కంఠముదాక భూమిలో పూడ్చిపెట్టి అప్పటికి ప్రొద్దు క్రుంకుటచే రేపు వీరిని ఏనుగులతో త్రొక్కించెదమని వెడలిపోవుదురు. ఆరాత్రి కొన్ని నక్కలు శవములను పీకుకొని తినుటకై వచ్చి, చచ్చి పడిన సేవకులు జోలికి వెళ్ళక రాజు దగ్గరకు వచ్చి అతని చుట్టును వున్నా మట్టిని పెల్లగించును. రాజు కొంత వీలు కలుగగానే గోతిలో కదలగా నక్కలు భయపడి పారి పోవును. వెంటనే రాజు, మంత్రి పురోహితులను పైకి తీసి, వారితో రహస్యముగా నగరములో ప్రవేశించును.      

ఆ అర్ధరాత్రి సమయములో మ్లేచ్చు లందరును, తమకు కష్టపడ నక్కర లేకుండ లభించిన విజయమునకు మహానంద పడుచు తిన్నంత తిని త్రాగినంత త్రాగి మైమరచి పోయి యుందురు. నగరములో ప్రవేశించిన రాజ మంత్రి పురోహితులు మంత్రియింటికి వెళ్ళి స్నాన భోజనాదులు చేసి సేనాపతులను సైన్యములను సమకూర్చుకొని రాజభవనము వనములోనికి వెళ్ళి మ్లేచ్చ నాయకుని, వాని భటులను సామూలముగా జంపివేసి రాజ్యమును మరల తన చేతిలోనికి దీసికొని తెల్ల వారునప్పటికి విజయ భేరి మ్రోగించును. ఆ విజయభేరి విన్న ప్రజలు తమ రాజు మ్లేచ్చుల పై విజయము సాధించినందుకు పరమానంద భరితులై విజయోత్సవములు చేసికొందురు.  


మరునాడు రాజు, మంత్రి సామంత పురోహిత నాగర జాన పదులతో మహా సభచేసి, మ్లేచ్చులతో ఇంకను ప్రాణములతో నున్న వారికి మరణ దండన విధించి ప్రజల అందరకును అభయ ప్రదానము చేయును.
కలియుగములో దైవారాధన చేయుటయే సకల శుభములకును కారణమగును. " కలౌ సంస్మరణాన్ముక్తిః" (కలియుగములో భగవంతుని నామము కీర్తించినచో ముక్తి కలుగును) అను పెద్దల సూక్తి ప్రకారము ఆ రాజు కేవలము భగవంతుని నామ కీర్తన చేయుటయేకాక దీక్ష పూని ఏకాదశ దినములు యాగ రూపముగా శ్రీహరిని ఆరాధించినవాడు. "యజ్ఞో వైవిష్ణు" అని పేద వచనము. యజ్ఞమే విష్ణు స్వరూపము. ఆ విధముగా శ్రీ మన్నారాయణుని ఆరాధించిన వానికి అపజయ మేల కలుగును? అని సూతుడు చెప్పగా మునులు అతడు చెప్పిన కధలను ఆనందించి, ఆ తరువాత కలియుగములో జరుగు సంఘటనలను, విషయములను వివరింపుమని కోరిరి. అంతట సూతుడిట్లు చెప్పసాగెను.       

First 2 3 4 5 6 7 Last

No comments:

Post a Comment