Wednesday, July 16, 2014

మార్కేండేయ పూరాణము 17




కౌగలించుకొన్నను లొంగిపోడాయని వరూధిని అతనిని కౌగలించుకొనెను. బ్రాహ్మణుడు మొగము త్రిప్పుకొని "శ్రీహరి" అనుచు ఆమెను త్రోసివేసి వెడలిపోయెను. నియమనిష్టా గరిష్టులైన వారికి శ్రీహరి నామము తప్ప మరొకటి నోటికి రాదు. వారి సంస్కార మటువంటిది. అగ్ని హొత్రుని ప్రార్ధించి తన యింటికి చేరుకొనెను.

ఇక్కడ వరూధిని ప్రవరుని కోసము తపించు పోవుచుండెను. వరూధి నిని ఇది వరకే ఒక గంధర్వ కుమారుడు ప్రేమించి ఈమెచేత తిరస్కరించబడెను. ఇప్పుడు వరూధిని ప్రవరునికై విరహము ననుభవించుట తెలిసికొని తాను మాయా ప్రవరుడై వచ్చెను. వరూధిని సంతోషించెను. కొంత కాలము సౌఖ్యములను భవించిరి. వరూధిని గర్భవతి అయ్యెను. మాయా ప్రవరుడు తన మోసము బయటపడకుండ మెల్లగా తప్పుకొనెను. వరూధినికి కొడుకు పుట్టెను. అతని పేరు స్వరోచి. అతడు వరూధిని దృష్టిలో ప్రవరుని కొడుకు. కావున అతనికి ఉపనయనాదులు చేయించి, వేద వేదాంగములు నేర్పించెను. ధనుర్వేదమును గూడ నేర్పించెను.    

స్వరోచి యొక నాడు మందర గిరి ప్రాంతమున తిరుగుచుండగా ఒక స్త్రీ ఆర్త నాదము వినిపించెను. ఆమెనితడు, నీవెవ్వరని యడుగగా, "నేను ఇందీవ రాక్షుడను గంధర్వరాజు కుమార్తెను. నన్నొక రాక్షసుడు భక్షించ బోవుచున్నాడు. నేను నా చెలికత్తెలతో విహరించుచు, సన్నముగా పుడకవ వలెనున్న ఒక మునిని అధి క్షేపించితిని. అతడు కోపించి, నిన్ను రాక్షసుడు భక్షించుగాక అని నన్నును, కుష్ఠ క్షయ వ్యాధి పీడితలు కండని నా చెలులను శపించెను. నేను నా తండ్రి నుండి సంపాదించిన శస్త్రాస్త్రములు నీకిచ్చెద "నని చెప్పి అవి అన్నియు ఉపదేశించెను. ఆది వ్యాస్త్రములతో స్వరోచి రాక్షసుని కొట్టెను. ఆ దెబ్బకతడు రాక్షసరూపము వదలి, "వీరుడా! నేనే ఇందీ వరాక్షుడను. ఈమె మనోరమ, నా కుమార్తె. బ్రహ్మ మిత్రుడను మునిని నేను ఆయుర్వేదము నేర్పుమని అడిగితిని. ఆయన కోపించి నన్ను రాక్షసుడవు కమ్మని శపించెను. గురునింద యెంత దోషమో అప్పుడు నాకు తెలిసినది. నీ బాణపు దెబ్బలవలన శాప విముక్తి కలిగినది. ఈ నా కుమార్తె నిచ్చెదను, వివాహమాడు"మనెను. స్వరోచి సమ్మతించెను. ఆమె చెలికత్తెలను గూడ శాపవిముక్తులను చేసెను.     

వారిలో విభావరి, "వీరవరేణ్యా! నా రోగము మాన్పితివి కావున నీకు సమస్త జంతు పక్షి భాషలను నేర్పెద" ననెను. నేర్పెను గూడ.

కళావతి, "నేనొక ముని కుమార్తెను. నా తల్లి పుంజిక స్థల అను అప్సరస. నేను పుట్ట గానే నన్ను నా తల్లి తండ్రులు విడిచి పెట్టిరి. పార్వతీ దేవినన్ను కరుణించి, నవనిధులకు కనిపెట్ట గలుగు "పద్మిని" అను విద్యను ఉపదేశించి, నీవు స్వరోచిని పెండ్లాడెను. వారితో సకల భోగమునుల నుభవించుచు, ఒక నాడు వేటకు బోయెను. అక్కడ ఒక భల్లూకo

No comments:

Post a Comment