Wednesday, July 2, 2014

పండుగలు





పండుగలు అనేవి ముఖ్యముగా మన బారతీయ సంప్రదాయమును అనుసరించుచూ చేసుకొనే వేడుకలు. సనాతనమైన మన సంస్కృతి, ఆచారములు, సంప్రదాయములను జ్ఞప్తియందుంచుకొనుటకు, వాటిని అనుసరిస్తూ మనం అదే రీతిల ధర్మ మర్గాన నడుచుకొనుటకు ఈ పండుగలను ముఖ్యముగా జరుపుకోనుచున్నాము.
' పండుగ' అనేది జరపటం వల్ల ప్రజలలోని ' ఆధ్యాత్మిక భావనలు' జగ్రుతమావుతాయి. వారిలో శాంతి సౌబ్రాత్రుత్వ గుణాలు వెల్లివిరిసి, సఖ్యతాభావం పెంపొందుతుంది. ఈ పండుగలను జరుపుకోవటం వల్ల సమాజంలో పేద గొప్ప తేడాలు నశించి, స్నేహభావం పెంపొందుతుంది. ఆధ్యాత్మిక౦గా, బౌతికంగా ప్రజలలో సంతృప్తి కలిగి సుఖశాంతులతో, సంతోషంగా ఉండగలుగుతారు. ఒక్కొక పండుగ ఒక్కొక విధమైన ప్రాముఖ్యతను కలిగి ఒక్కొక రకమైన నీతిని బోదిస్తుంది. యాంత్రికపరమైన జీవన విదానంలో నుంచి కొంత సమయమైనను ప్రజలను బయటకు తీసుకుని రావటానికి పండుగలు ఎంతగానో సహాయపడతాయి. పండుగలు జరుపుకోనుటవలన మనస్సు కు ఒకవిదమైన భక్తి, శాంతి కలుగుతుంది. పురాణములలో, ఇతిహాసములలో పండుగలకు ఒక విశిషాత వున్నది. ఇవి జరుపుకోనుటకు ఆవశ్యకమైన సహజవంతమైన సందర్భములు ఇతిహసములందు ఇమిడియున్నవి. పండుగలను జరుపుకొనుట వలన వివిధ ప్రాంతాలలో గల బంధువులు ఒకచోట కలుసుకొని వేడుకలు జరుపుకొందురు. దీనివలన బందుత్వము, ప్రేమాభిమానములు పెంపొందుతాయి. అందువలన మన హిందు సంప్రదాయములో పండుగలకు ఒక విశిష్టమైన స్థానము వున్నది.




No comments:

Post a Comment