Wednesday, July 9, 2014

శ్రీ బ్రహ్మాండ పురాణము8




లింగోత్పత్తి
ఒకప్పుడు శ్రీ మన్నారాయణుడు పాల సముద్రములో శేషునిపై పరుండి యుండెను . ఆ సమయమున దేవతలు అచటికి వచ్చిరి .నారాయణుని దర్శించి ,నీ కరుణా కటాక్షము వలన మాకు బలిచక్రవర్తి పీడ వదలినది .నీవు వామనుడవై బలిచక్రవర్తిని పాతాళమునకు బంపితివి .నీ మహిమను మేమేట్లు పొగడగలము /" అని వినుతింపగా, శ్రీ హరి వారిని జూచి ,"దేవతలారా ! నీకీ మహిమ యంతయు పరాత్పరుడైన పరమేశ్వరుని కరుణ వలన గలిగినది. అతడే సమస్త జగములకు పరిపాలకుడు .ఒకప్పుడు ప్రళయ సముద్రములో నేను ఒంటరిగా స్వతంత్రుడనై మఱ్ఱి యాకులో బండుకొని యుంటిని. అప్పుడు నేను సహస్ర శిరస్సులతోను ,సహస్ర బాహువులతోను , సహస్ర పాదములతోను ఉంటిని .అపుడు నా ముందు ఒక మహా తేజస్సు కనబడినది .క్రమముగా ఆ తేజస్సులో ,నాలుగు ముఖములు గలవాడును .బంగారు రంగు శరీర కాంతి కలవాడను, కృష్ణా జిన ,కమండలములు ధరించినవాడును అగు ఒక మహాపురుషుడు కనిపించెను. అతడు నా వద్దకు వచ్చి ,"నీ వెవ్వడవు ? ఒంటరిగా మహా సముద్రములో నున్నావు ?నేను స్వతంత్రుడవై సృష్టి చేయగల బ్రహ్మను నేను స్వయంభువుడును.సృష్టి స్థితి సంహారకుడను గూడ నేనే "అనగా నేను "ఓ చతుర్ముఖుడా ! వినుము .నీవే సర్వ స్వతంత్రుడవని విర్ర వీగుచున్నావు అసలు నేనే సృష్టి స్థితి లయ కారకుడను . లేనిపోని గొప్పలు చెప్పుకొనకుము" అని మందలించితిని. దానిపై అతనికి నాకును పెద్ద వాగ్వాదము జరిగెను. ఇంతలో మా యెదుట నొక మహా తేజస్సు ఉత్తర దిశ నుండి వచ్చి నిలిచెను. అది క్రమముగా శిరమున చంద్రుని దాల్చి యున్నట్లు కనబడెను. బ్రహ్మయు నేనును దాని దగ్గరకు పోయితిమి .అదియొక మహాలింగముగా కనిపించెను . దాని మూలము గాని అగ్రము గాని తెలియుట లేదు. అప్పుడు బ్రహ్మ నాతో , "దీని మూలమేమో అగ్రమేమో మనము తెలిసికొనవలెను. నీవు క్రిందికి పోయి మూలమును కనుగొని రమ్ము .నేను పైకి బోయి అగ్రమును కనుగొని వచ్చెదను "అని చెప్పగా నేను అంగీకరించి మూలమును వెదకుచు పోవసాగితిని .అట్లోక వేయి దివ్య సంవత్సరములు ప్రయాణము చేసినను,నాకు మూల మేక్కడో కనిపించలేదు .ఇదేదో మహావిషయమని భావించి వెనుకకు మరలి పూర్వము బ్రహ్మతో మాట్లాడిన చోటికి వచ్చితిని. బ్రహ్మ కూడా అక్కడకు వచ్చెను. నేను లింగము మూలమును చూడలేక పోయితిని సత్యము చెప్పితిని బ్రహ్మ కూడా దాని ఆగ్రము చూడ లేక పోయితిని అనిచేప్పెను. మా గర్వములు అణిగి పోయినవి పరమేశ్వర మాయా విమోహితులమై ఏమి చేయుటకును తోచక ,ఓ సర్వా దారుడ వైన పరమేశా ! మమ్ము రక్షింపు " మని ప్రార్ధించితిమి . కొంచె మాలోచించి "అనంతుని ధ్యానము చేయవలెను గాని ఇట్లు భయపడి ప్రయోజనము " లేదనుకొని ధ్యాన నిమగ్నులమై అతని అనంత తత్వమును బహువిధముల స్తుతించితిమి .
అపుడు మా యెదుట కోటి సూర్యుల కాంతితో ,పినాకము ,త్రిశూలము ,పాప జందెమును దాల్చి శివుడు ప్రత్యక్షమై ,మహాట్టహాసము చేసెను. దానికి మేము భయమంది వణకి పోయితిమి .పరమేశ్వరుడు మమ్ము జూచి

No comments:

Post a Comment