నాగులచవితిని మన హిందువులు అత్యంత భక్తి
శ్రద్దలతో జరుపుకొందురు. కార్తీక భహుళ చవితినాడు శ్రీ సుబ్ర హ్మా న్యేశ్వర
స్వామికి ప్రీతికరమైన రోజు.ఈనాటి దినమున శ్రీ సుబ్ర హ్మా న్యేశ్వరస్వామి
ఆలయములకు వెళ్లి ప్రజలు అత్యంత భక్తి శ్రద్దలతో పూజలు , అభిషేకములు, అష్టో
త్తరములు చేయించెదరు.
నాగులచవితిని ఒక పండుగగా ప్రజలు
జరుపుకొందురు.ఈ చవితి రోజున ప్రాతః కాలముననే లేచి కాలకృత్యములు తీర్చుకొని ,
' పుట్ట' ఉన్నచోట అనగా ఆ స్వామి పాముల రూపములో వెలసిన పుట్టలో ఆవు పాలు
పోయుదురు.బెల్లం-బియ్యపు పిండితో కలిపి చేసిన చలిమిడి , ఒడపప్పు (అనగా నాన
బెట్టిన పెసరపప్పు )ఇవన్ని కలిపి ఆరోజున నివేదన చేస్తారు.ఆ పుట్ట పైని
మట్టిని పవిత్రముగా భావించి కొంత తీసుకుని భక్తి, నమ్మకము కలవారు తమ
చెవులకు అతికించుకుంటారు. ఇలా చేసినచో చెవిపోటు, నెప్పి అలాంటి అనారోగ్యము
కలుగదని వారి నమ్మకము.
నమ్మినవారికి కోరిన వరములను ప్రసాదిస్తూ
ఈ లోకమున అనేక ఆలయములందు వెలసిన దైవము శ్రీ సుబ్రహ్మన్యేస్వరస్వామి. కావున
కార్తీకమాసమందు వచ్చు పుణ్య దినములలో ముఖ్యమైనది ఈ నాగులచవితి.
ఈ పండుగనే కార్తీక బహుళ పంచమినాడు 'నాగుల పంచమి ' గా కూడా జరుపుకొందురు.
No comments:
Post a Comment