చంపబోగా ఆడలేడి యొకటి అడ్డమువచ్చి, "నన్ను చంపుము; నేను వరించిన వానిని పొందలేక పోయితి" ననగా, అతడు "నీవెవరిని
వరించితి"వని యడిగెను. ఆలేడి, "నిన్నే" అని ప్రత్యుత్తర మిచ్చెను. స్వరోచి
నవ్వి, నీవు లేడివి. నీతో వివాహమేమి? అనగా, లేడి, "ఒకసారి నన్ను కౌగలించుకొనుము.
నీకే తెలియు" ననెను. అతడా లేడిని కౌగలించుకొనెను. ఆలేడి ఒక మహా
సౌందర్యవతియైన స్త్రీగా మారి, "నేను దేవతల కోరిక పై నిన్ను వరింపవచ్చినాను.
మన కలయిక వలన మనువు కాగల ఒక మహానుభావుడు పుట్టును" అని చెప్పగా
స్వరోచి ఆమెను గాంధర్వ వివాహమాడి ఆమెతో సౌఖ్యములను భవించెను. ఆమెకు సద్యో గర్భమున
(ఏడు గడియలలో) పిల్లవాడు జన్మించెను. వాడు జన్మించగానే దేవతలు పుష్పవర్షము
గురిపించిరి. అతని పాలనలో ధర్మము నాలుగు పాదములతో నడచెను. స్వరోచి
కుమారుడుగాన స్వారోచి షుడని పిలువబడెను.
మూడవవాడు ఉత్తముడు, నాలుగవ వాడు తాప(మ)సుడు, అయిదవ వాడు రైవతుడు, ఆరవ వాడు చాక్షుషుడు, ఏడవ వాడు సూర్యకుమారుడైన వైవస్వతుడు. అతని మన్వంతరమే (మనువు పరిపాలన కాలము) జరుగుచున్నిది.
ఈ పైన సూర్యసావర్ణ, అగ్నిసావర్ణ, బ్రహ్మసావర్ణ, రుద్రసావర్ణ, దక్షసావర్ణ (ధర్మసావర్ణ) రౌచ్యుడు, భౌచ్యుడు అను ఏడుగురును పరిపాలనలోకి వచ్చెదరు.
వీరి చరిత్రలు చదివినను, కనీసము నామములు విన్నను సకలారిష్టములు తొలగి, ఆయురారోగ్య భోగభాగ్యములు, శత్రునాశనమును, సకల కార్యవిజయమును కలుగును. అని జ్ఞాన పక్షులు చెప్పగా జైమిని సంతోషించి, సూర్యోపాసన వలన పలితములు చెప్పుడని కోరెను.
పక్షులిట్లు చెప్పసాగెను. "సూర్యుడు జగత్తులకే కన్నువంటివాడు. అయన బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపుడు. ఉదయకాలమందు బ్రహ్మ స్వరూపుడు. మధ్యాహ్నకాలమందు రుద్ర స్వరూపుడు. సాయంకాలమున విష్ణు స్వరూపుడ నియు చెప్పబడును. వేదములందును ఈయన మహిమలు ఇట్లు వర్ణింపబడినవి. సూర్యుడు వేదమయుడు. పాత్రఃకాలమున ఋగ్వేదమునందు వెలుగొందు చుండును. మధ్యాహ్నమున యజుర్వేదమున ప్రకాశించును. సాయంకాలమునందు సామ వెదమున దీపించును. త్రికాలము లందును ఏ క్షణము గూడ వేదములు అనుసరించకుండ సూర్యుడు సంచరించడు.
సూర్యునారాధించు వారికి హృద్రోగములు (గుండెజబ్బులు) ఉండవు. హరిమ (పచ్చ కామెర్లు) అను వ్యాధి రాదు. నేత్ర రోగములుండవు. (పూర్వము మయూరుడను మహాకవి, అంధుడై తనకు దృష్టి కలుగుటకు సూర్యుని ఆరాధించి
ఆయన పై నూరు శ్లోకములు చెప్పి, ఆయన అనుగ్రహము చేత దృష్టిని సంపాదించెను. ఉదర సంబంధము లైన రోగములుగాని, మహావాత, మేహరోగములుగాని సూర్యు నారాధించెడి వారికి రావు.

No comments:
Post a Comment