·
నానాటికి
పెరిగిపోతున్న ఆధునిక నాగరికతకు అనుగుణంగా వాహనాల కొనుగోలు అధికం కావడంతో పాటు
ప్రతి ఒక్కరూ, ద్విచక్ర
వాహనాలు, కారు వంటి వాహనాలను ఉపయోగిస్తుంటారు. అయితే ఈ
వాహనాల్లో అప్పుడప్పుడు ఏవో లోపాలు ఏర్పడటం గమనిస్తుంటారు. ఇలాంటి సమస్యలు
పార్కింగ్ స్థలాన్ని ఎన్నుకోవడం ద్వారా కూడా ఉద్భవిస్తాయని వాస్తు నిపుణులు
అంటున్నారు. దీని ప్రకారం పార్కింగ్ విధానంలో చేపట్టాల్సిన అంశాలను పరిశీలిస్తే...
·
·
ఇంటికి
ఉత్తరం, తూర్పు
ప్రాంతాల్లో పార్కింగ్ దిక్కులుగా వాస్తు సూచిస్తోంది. దీని ప్రకారం వాహనాలను
తూర్పు, ఉత్తరం ప్రాంతాల్లో పార్కింగ్ చేయడం ఉత్తమం. ఇలా
చేస్తే వాహనాల్లో ఏర్పడే సమస్యలను అరికట్టవచ్చునని వాస్తు శాస్త్రజ్ఞులు
చెబుతున్నారు. ఇదే విధంగా ఉత్తరం, తూర్పు దిశల్లో ఎక్కువ
కాలం పాటు వాహనాలను ఆపి ఉంచకూడదు. ఈ దిక్కులో వాహనాలను ఎక్కువ కాలంపాటు ఆపి ఉంచితే
అప్పుడప్పుడు వాహనాల్లో లోపం ఏర్పడి లేని పోని సమస్యలకు దారి తీస్తాయి.
అంతేకాకుండా ఆ వాహనాలను అమ్మే స్థితికి చేరుకుంటారు.
·
·
పాడయిన
వాహనాలను తూర్పు. దక్షిణం, పశ్చిమం,
దక్షిణ దిశలుగా ఆపవచ్చు. తూర్పు, ఉత్తరం
ప్రాంతాల్లో పార్కింగ్ షెడ్లను ఏర్పాటు చేయకూడదు, అంతేకాకుండా
నూనె, గ్రీస్ వంటి వాహనాలకు సంబంధించిన నూనె పదార్థాలు ఈ
దిక్కుల్లో ఉండకూడదు. ఇంటికి ఉత్తర, పశ్చిమ దిక్కుల్లో
వాహనాలను నిలిపేందుకు షెడ్లను ఏర్పాటు చేయవచ్చు. పైన పేర్కొన్న విధంగా
వాస్తు ప్రకారం పార్కింగ్ ప్రాంతాలను ఎంచుకుంటే వాహన ప్రమాదాలను, వాహన లోపాలను ఎదుర్కోవచ్చునని వాస్తు శాస్త్రజ్ఞులు అంటున్నారు.
No comments:
Post a Comment