కొంత కాలము తరువాత, నుతశ్లోకుడు, సత్యనిష్ఠుడు, వైకుంఠ ప్రియుడు అను ముగ్గురు విష్ణుభక్తులు కాశ్మీరమునుండి నారాయణాద్రికి వచ్చి విష్ణుసేవ చేసి తిరికి పోవుచు వింధ్యారణ్యమునకు వచ్చిరి. వారు వచ్చుట తెలిసి బ్రహ్మ రాక్షసుడు సకుటుంబముగా బోయి, వారికి నమస్కరించి తమ పూర్వచరిత్రము చెప్పి, రక్షింపుడని ప్రార్ధింపగా వారు హరి నామ ప్రభామును చెప్పిరి. వైకుంఠ ప్రియుడు "మీరు నారాయణాద్రికి వెళ్ళి కల్యాణ తీర్ధమున స్నానమాడి, నారాయణుని పూజించినచో రాక్షసాది రూపములు పోవు" ననెను.
చతుర్వేది సకుటుంబముగా పోయి ఆ పుణ్య తీర్ధములో మునిగి నారాయణుని సేవింపు చుండగా ఐదు నెలలు గడచెను. విష్ణుదెవునకు దయపుట్టి, జయ విజయులను బిలిచి, "మీరు వెళ్ళి చతుర్వేదిని, వాని కుటుంబము వారిని ఇతర తీర్ధములలో గూడ స్నాన మాడించి పవిత్రులను జేసి, రాక్ష సరూపములు పోగొట్టిరం"డని ఆదేశించెను.
ద్వారపాలకులట్లే చేసి చతుర్వేదికి, అతని వారికి, పాపవిముక్తి కలిగించిరి. వారు పూర్వ జన్మములో నేర్చిన విద్యలతో బ్రహ్మతేజముతో ప్రకాశించిరి. పరమ విష్ణుభక్తులై తరించిరి. ఈ కళ్యాణ తీర్ధ ప్రభావము విన్నను, చదివినను శ్రీహరి యనుగ్రహముతో పాటు భుక్తి ముక్తులు లభించును.
No comments:
Post a Comment