ఆచమనము అయిన తరువాత ,కొంచెం నీరు చేతిలో పోసుకుని
నేలపై చిలకరించుతూ ఈ శ్లోకమును పటించవలెను .
శ్లో || ఉత్తిష్టంతు భూత పిశాచాః యేతే భూమి భారకాః
యేతేషామ విరోదేన బ్రహ్మ కర్మ సమారభే ||
శ్లో || ఉత్తిష్టంతు భూత పిశాచాః యేతే భూమి భారకాః
యేతేషామ విరోదేన బ్రహ్మ కర్మ సమారభే ||
ప్రాణాయామమ్య:
శ్లో|| అంగుళ్య గ్రైర్నాసికాగ్రం
సంపీడ్యం పాపనాశనమ్
ప్రాణాయామ మిదం ప్రోక్త మృషిభి:
పరికల్పితమ్
ఓం భూ : -ఓం భువః ఓం సువః - ఓం మహః
-ఓం జనః ఓం తపః - ఓగ్ సత్యం -ఓం తత్ సవితుర్వరేణ్యం
భర్గో దేవస్య
ధీమహీ దీయో యోనః ప్రచోదయాత్ -
ఓం ఆపోజ్యోతిర సోమృతం బ్రహ్మ భూర్భువ స్సువరోం
అని సంకల్పము చెప్పు కొనవలెను.
సంకల్పము : మమ ఉపాత్త సమస్త దురితక్షయ ద్వారా
శ్రీ పరమేశ్వర ముద్దిశ్య శ్రీ పరమేశ్వర ప్రీత్యర్ధం శుభే శోభన ముహూర్తే
అద్య బ్రాహ్మణః (ఇక్కడ శ్రీ మహా విష్ణో రాజ్ఞాయ అని కూడా చెప్పవచ్చు )
ద్వితీయ పరార్దె శ్వేత వరాహ కల్పే వైవస్వత మన్వంతరే
కలియుగే ప్రధమ పాదే జంబూ
ద్వీపే భరత వర్షే భరత ఖండే
మేరోర్దక్షిణ దిగ్బాగే శ్రీ శైలస్య ఈశాన్య
ప్రదేశే
(మనకు శ్రీశైలము ప్రధాన క్షేత్రము కావున మనము
శ్రీశైలమునకు ఏ దిక్కున
ఉన్నామో ఆ దిక్కు చెప్పుకొనవలెను ),
కృష్ణా గోదావర్యో : మధ్య ప్రదేశే
(మనం ఏ ఏ నదులకు మధ్యన
ఉన్నామో ఆయా నదుల పేర్లు చెప్పుకొనవలెను ), శోభన గృహే
(అద్దె ఇల్లు ఐనచో వసతి
గృహే అనియు , సొంత
ఇల్లయినచో
స్వగృహే అనియు చెప్పుకొనవలెను ), సమస్త దేవతా
బ్రాహ్మణ హరిహర సన్నిదౌ అస్మిన్ వర్తమానే
వ్యావహారిక చాంద్రమానేన
.......... సంవత్సరే , (ఇక్కడ తెలుగు సంవత్సరమును
అంటే
పూజ చేయునపుడు ఏ సంవత్సరము జరుగు చున్నదో
ఆ సంవత్సరము యొక్క
పేరు చెప్పుకొనవలెను. ) ......... ఆయనే ,
సంవత్సరమునకు రెండు ఆయనములు -
ఉత్తరాయణము, దక్షిణాయనము
.
జనవరి 15 మకర సంక్రమణం మొదలు జూలై 14 కర్కాటక సంక్రమణం
వరకు ఉత్తరాయణము
, జూలై 15 కర్కాటక సంక్రమణము నుండి
మరల
జనవరి 14 పెద్ద
పండుగ అనగా మకర సంక్రమణము
వరకు దక్షిణాయనం పూజ చేయునపుడు ఏ ఆయనము
జరుగుచున్నదో దానిని చెప్పవలెను )...........ఋతు :
(వసంత ,గ్రీష్మ , వర్ష మొ || ఋతువు లలో పూజ సమయములో
జరుగుచున్న ఋతువు పేరు
)............మాసే ,
(చైత్ర , వైశాఖ మొ || పన్నెండు మాసములలో పూజాసమయంలో
జరుగు చున్న
మాసం పేరు ) .......పక్షే ,
(నెలకు
రెండు పక్షములు
పౌర్ణమికి ముందు శుక్ల పక్షము ,
అమావాస్యకు ముందు కృష్ణ పక్షములు వీటిలో పూజ జరుగుచున్న
సమయమున గల
పక్షము పేరు ) ........తిధౌ , (ఆరోజు తిది )
.........వాసరే (ఆ
రోజు ఏ వారమైనది చెప్పుకొని )
శుభ నక్షత్రే , శుభయోగే ,శుభ కరణే ఏవంగుణ
No comments:
Post a Comment