Tuesday, November 12, 2013

శ్రీ వినాయక స్వామి వారి చరిత్ర 11




కాణిపాకం ప్రమాణాలకు పవిత్ర క్షేత్రంగా ఎంతో ప్రసిద్ద కెక్కింది.
 ప్రమాణ పురుషుడైన వరసిద్ది వినాయకుడే న్యాయ నిర్ణేత వివాద మైన స్వామి 
సన్నిధిలో అవలీలగా పరిష్కారం కావడం నిజంగా వరసిద్ది వినాయకుని మహిమా విశేషం.
 సర్వ సాధారణంగా లోకంలో తమ వివాదాలను పరిష్క రించు కోవడానికి 
ఉభయ పక్షాల స్టేషన్ల ను, న్యాయ స్థానాలను లేక మధ్య వర్తులను 
ఆశ్రయించడం పరిపాటి అయినప్పటికీ అవి పరిష్కారం కావడం అంత సులువు కాదు.
 వివాదాలతో సత మత మయ్యే ఇరు పక్షాల వారు పుష్కరిణిలో స్నానం 
చేసి చిట్టా శుద్ధి తో వరసిద్ది వినాయకుని సన్నిధానంలో చేరి తమ వివాదాన్ని 
విన్న వించు కొని వెలిగించిన హారతి కర్పూరాన్ని అర్ప గలిగితే చాలు అంతే. 
వారి తగువును అరక్షణంలో స్వామి తిర్చ గలుగుతూ వున్నాడు. 
 ప్రమాణం చేయడానికి ముందె ఎవరికీ వారు తమకు తామై తమ తప్పులు ఒప్పుకొని 
 పరిశుద్ద మనస్కులు కావడం ఇక్కడ జరిగే విచిత్ర, పవిత్ర పరివర్తన పూర్వక పరిణామ౦.
తగవులు తీర్చు వినాయక! జగమున నీ కన్న కాలరే సాక్షి ! పవిత్ర మ్మగు 
మనసు న నీ సన్నిధి తగవరు లై నిలిచి తప్పిద ములు తెలుపరే!
ప్రమాణాలు చేయడం పూర్తయిన వెంటనే అపరాధిగా భావింప బడే వ్యక్తిని విడిచి
 పెట్టడం ఇచ్చట సర్వ సాధారణంగా అనుసరించే పద్దతి చేసిన ప్రమాణం నిజమే 
అయితే అతనికి ఎటువంటి అరిష్టాలు కలుగవు, క్షేమంగా నే ఉంటాడు.
 ఆ విధంగా కాకుండా అపర్ధలే పలికి వుంటే తప్పక వెంటనే శిక్ష అనుభవించి తీరుతాడు. 
స్వామి అపర ధు ల్ని శిక్షించిన సందర్భాలు ఎన్నో అన్నాయని ఇక్కడి ప్రజలు చెబుతారు.
 సామాన్య న్యాయ ధి పతి కన్న లోకాధి పతియే మిన్న అనే సత్యానికి 
ఈ క్షేత్రం చక్కని నిదర్శనం.
ఇక సంతాన ప్రాప్తి లేని దంపతులు, దీర్ఘ వ్యాధి గ్రస్తులు సైతం ఈ దివ్య క్షేత్రాన్ని 
దర్శించి స్వామి వారిని కనీసం 11 దినాలు గాని, లేదా 22 దినాలు గాని, 
 ఒక మండలం అనగా 41 దినాలు ఎంతో నియమ నిష్టతో స్వామిని పూజిస్తే 
 అటువంటి వారికీ సంతాన ప్రాప్తి కలగటం, ఆరోగ్య౦ చే కూర టం జరుగుతుంది.
 ఈ విధంగా ఒకటి రెండు కాదు ఎన్నో విషయాలలో స్వామి అత్య ద్భుత మహిమలు 
ప్రత్యక్ష ప్రమాణాలతో నిరూపింప బడినాయి.

 First  1   2   3  4  5  6  7  8  9  10  11  12   13   Last

No comments:

Post a Comment