దీపం:
శ్లో|| సుప్రకాశో మహాదీపః సార్వత
స్తిమిరాపహా
సబాహ్యభ్యంత జ్యోతి: దీపోయం
పరిగృహ్యతామ్ ||
ఓం శ్రీ............ నమః
సాక్షాత్ దీపం దర్శయామి అని మొదట్లో చెప్పిన
విధంగా దీపారాధనలో వున్న
అదనపు వత్తులలో ఒకదానిని తీసుకొని
హారతి వెలిగించే దాంట్లో వేసి
వెలిగించి గంట మ్రోగిస్తూ ఆ దీపం స్వామికి
చూపుతూ పై శ్లోకమును చదువవలెను.
నైవేద్యం
శ్లో|| అన్నం చతుర్విధం స్వాదురసై: షడ్భి
సమన్వితమ్
భక్ష్య భోజ్య సమాయుక్తం నైవేద్యం
ప్రతిగృహ్యతామ్ ||
ఓం శ్రీ.................
నైవేద్యం సమర్పయామి అని ఒక బెల్లం ముక్క,
పళ్ళు, కొబ్బరికాయ మొదలగునవి ఒప్క
పళ్ళెములోనికి తీసుకొని
స్వామివద్ద నుంచి దానిఅపి పువ్వుతో నీళ్ళు చల్లుతూ
ఎడమచేత్తో
గంటవాయిస్తూ ' ఓం భూర్భువస్సువః ఓం తత్ సవితుర్వరేణ్యం భర్గో
దేవస్య
ధీమహి, ధీయోయోనః ప్రచోదయాత్, సత్యంత్వర్తే న పరిషంచామి
( ఋతం త్వా
సత్యేత పరిషంచామి అని రాత్రి చెప్పవలెను)
అమృతమస్తు అమృతోపస్తరణమసి, ఓం ప్రాణాయస్వాహా,
ఓం అపానాయ స్వాహా, ఓం వ్యానాయ స్వాహ, ఓం ఉదానాయ స్వాహా,
ఓం సమానాయ స్వాహా, మధ్యే మధ్యే పానీయం
సమర్పయామి
అంటూ ఆరుసార్లు చేతితో (చేతిలోని ఉద్ధరిణెతో) స్వామికి నివేదనం
చూపించాలి.
పిదప ఓం శ్రీ................... నమః నైవేద్యానంతరం '
హస్తౌ ప్రక్షాళయామి' అని ఉద్ధరిణెతో
పంచపాత్రలోని నీరు ముందు
చెప్పిన అర్ఘ్యపాత్ర (పంచపాత్ర కాకుండా విడిగా చెంబులో
పెట్టుకొనే నీళ్ళ పాత్ర) లో వదలాలి. తరువాత ' పాదౌ ప్రక్షాళయామి'
అని మరొకసారి నీరు అర్ఘ్యపాత్రలో
ఉద్దరిణెతో వదలాలి. పునః
శుద్ధచమనీయం సమర్పయామి. అని ఇంకొక పర్యాయం నీరు వదలాలి.
తదనంతరం...........
తాంబూలం:
శ్లో|| పూగీఫలై స్స కర్పూరై ర్నాగవల్లీ
దళైర్యుతమ్
ముక్తా చూర్ణ సమాయుక్తం తాంబూలం
ప్రతిగృహ్యతామ్ ||
అని చెబుతూ మూడు
తమలపాకులు, ఎండు పోకచెక్కలు వేసి
స్వామి వద్ద ఉంచాలి. తాంబూలం వేసుకున్నాక నోరు
కడుక్కొనుటకు
నీరు ఇస్తున్నామని తలస్తూ, ' తాంబూల చరవణానంతరం శుద్ధ
ఆచమనీయం సమర్పయామి' అంటూ ఉద్ధరినేతో నీరు అర్ఘ్యపాత్రలో వదలాలి.
No comments:
Post a Comment