Sunday, November 10, 2013

నిత్యపూజా విధానము 10




శుద్దోదక స్నానం:
శ్లో|| పరమానన్ద  బోధాబ్ది నిమగ్న నిజమూర్తయే
సాంగో పాంగ మిదం స్నానం కల్పయా మీశతే పునః    ||
శ్రీ........... నమః శుద్దోదక స్నానం సమర్పయామి. 
పంచపాత్రలోని శుద్ధ నీటిని పువ్వుతో దేవునిపై చల్లవలెను.

వస్త్ర యుగ్మం:
శ్లో|| య మాశ్రిత్య మహామాయా జగత్సమ్మోహినీ సదా
తస్మై తే పరమేశాయ కల్పయా మ్యుత్త రీయకమ్      ||
ఓం శ్రీ......................... నమః వస్త్ర యుగ్మం సమర్పయామి 
(యుగ్మ మనగా రెండు) అనుచు వస్త్రమును
 (ప్రత్తిని పెద్దబొట్టుబిళ్ళ సైజులో గుండ్రముగా చేసి నీటిలో
 తడిపి ఆపైన రెండువైపులా కుంకుమతో అద్దినచో అది వస్త్రమగును. 
 ఇటువంటివి రెండుచేసుకో వలెను) స్వామివారి ప్రతిమకు అద్దవలెను.

యజ్ఞోపవీతం:
శ్లో|| యస్య శక్తి త్రయే ణేదం సంప్రోత మఖిలం జగత్
యజ్ఞ సూత్రాయ తస్మైతే యజ్ఞ సూత్రం ప్రకల్పయే   ||
శ్రీ...............నమః ఉపవీతం సమర్పయామి అనగా జందెమును ఇవ్వవలెను.
 ఇదియును ప్రత్తితో చేయవచ్చును. ప్రత్తిని తీసుకొని 
పసుపుచేత్తో  బొటనవ్రేలు, మధ్యవ్రేలితో మధ్య మధ్య నలుపుతూ
 పొడవుగా చేసి, కుంకుమ అద్దవలెను. దీనిని పరుషదేవతా పూజకు
 మాత్రమే సమర్పించవలెను.

గంధం:
శ్లో|| పరమానంద సౌరభ్య పరిపూర్ణ దిగంతరం
గృహాణ పరమం గందం కృపయా పరమేశ్వర   ||
శ్రీ............నమః గంధాన్ సమర్పయామి. ముందుగా తీసిపెట్టుకొన్న 
గంధమును కుడుచేతి ఉంగరం వ్రేలుతో స్వామివారి ప్రతిమపై చల్లవలెను.


First   1  2  3  4  5  6  7  8  9  10  11  12  13  14  Last

No comments:

Post a Comment