Wednesday, November 13, 2013

శ్రీ వినాయక స్వామి వారి చరిత్ర 8






గ్రుడ్డి మూగ చెవిటి పడ్డ పాటులు గాంచి కలిగె దైవమునకు 
కరుణ- జాలి మనుజ యత్న మునకు 
 అనుపమ దైవయ త్న మ్ము తోడు పడిన దనరు
 సిద్ది బావి నుండి నీరు పైకి తియ్యడానికై బాన వదలి పెట్టారు.
 అది భళ్ళున పగిలినది.
 పగిలిన బానను తీసి మరొక బాన కట్టి బావిలోకి వదిలారు.
 అది కూడ అదే విధంగా పగిలి పోయింది . 
 మళ్ళి మళ్ళి బాణలి బావిలోకి దింపడం అవి పగిలి పోవడం
 చూసి ఏదో రాయి గట్టిగా కుదురు కొని వుంది.
 దానిని మెల్లగా తొలగిస్తే చాలు అనుకొన్న పని నేర వేరు  
తుందని వారు నిర్ణ యించు కొన్నారు.
 అడ్డు తగిలిన రాతిని శిధిలం చేయడానికి గున పంతో 
పదే పదె పొడవడం మొదలి పెట్టారు.
 త్రవ్వుతున్న ఆ ప్రదేశంలో గున పంత గిలిన చోటు నుండి 
ఖంగు మనే శబ్దం వినిపించింది.
 ఒకటికి మూడు సార్లు ఈ విధంగానే శబ్దం వచ్చింది.
 చివరి దెబ్బతో ఏదో చిన్న రాతి ముక్కో లేక గట్టి 
 ఎర్ర మట్టి పెళ్ళో విరిగి అవతల పడింది. 
అంతే ఆ పగిలిన చోటు నుండి ఏకంగా రక్తం ఎగ జిమ్మింది.
 రక్తం ఎగ జిమ్మ డానికి కారణం స్వయం భూవు అయిన 
 వినాయకుని తల వెనుక భాగం చిట్లి ఎగిరి పడడమే,
 ఏక ధారగా రక్తం కారుతూనే వుంది. 
పరమేశ్వరుని జటా జూటం నుండి గంగ పరవళ్ళు 
త్రొక్కుతూ పరుగులు తీసినట్లు గా రక్త జలం నురుగులు
 కక్కుతూ వెలువడింది. 
అది వరసిద్ది వినాయకుని ఆవ్యాజ కరుణా కటాక్ష పూర్ణ 
మైన అమృత సారమని 
ఆ అమాయకులకు అర్ధం కాలేదు. 
అద్భుతా శ్చర్య సం భ్ర మాలు వారిని ముప్పు రి గొన్నాయి. 
వారికీ దిక్కుతో చని స్థితి ఏర్పడింది. ఎప్పుడు రక్త 
జలంతో వారి శరీరాలు తడిసి ప్రక్షాళన జరిగిందో అంతలో 
మూగ వానికి మాటలు సవ్యంగా వచ్చాయి. చెవిటి
 వానికి సర్వమూ శ్రావ్యంగ స్పష్టంగా వినిపించింది. 
గట్టు పైన ఉన్న గుడ్డి వానికి కూడ దివ్య శ్రీ మైన చూపు వచ్చింది.

 First  1   2   3  4  5  6  7  8  9  10  11  12   13   Last

No comments:

Post a Comment