పూజను ఆరంభించుటకు
ముందు గృహమును శుభ్రముచేసికొని,
ఇంటిలో
ఈశాన్యమూలలో స్థలమును శుద్ధిచేసి, అలికి,
బియ్యపుపిండితో
గాని, రంగుల చూర్ణములతోగాని, ముగ్గులు పెట్టి,
దైవస్థాపన
నిమిత్తమై ఒక పీటను వేయాలి. పీటమరీ ఎత్తుగాగాని,
మరీ పల్లముగా గానీ ఉండకూడదు.
పిదప ఆ పీటకు కూడా చక్కగా పసుపురాసి, కుంకుమతో
బొట్టుపెట్టి, వరిపిండి (బియ్యపు పిండి) తో ముగ్గు వేయాలి.
సాధారణంగా అష్టదళపద్మాన్నే వేస్తారు. పూజచేసేవారు
తూర్పుముఖంగా
కూర్చోవాలి. ఏదైవాన్ని
పూజించబోతున్నారో
ఆ దైవం యొక్క ప్రతిమనుగాని, చిత్రపటంగాని ఆపీటపై ఉంచాలి.
ముందుగా పసుపుతో గణపతిని తయారుచేసి (పసుపును
షుమారు
అంగుళం సైజులో
త్రికోణ ఆకృతిలో ముద్దగా చేసి),
దానికి
కుంకుమ బొట్టు పెట్టి, పిదప ఒక పళ్ళెంలో గాని,
క్రొత్త
తుండుగుడ్డ మీద గాని బియ్యం పోసి దానిపై
ఒక తమలపాకునుంచి, అందు పసుపు గణపతినుంచి
అగరువత్తులు వెలిగించాలి.
ఇపుడు పూజకు కావలసిన వస్తువులను అమర్చుకోవాలి.
దీపారాధన నైఋతి దిశలో
చేయవలెను.
పూజకు కావలసిన వస్తువులు - దీపారాధన చేయు విధానము:
పూజకు కావలసిన వస్తువులు - దీపారాధన చేయు విధానము:
దీపారాధన చేయుటకు కుంది (ప్రమిద) వెండిది గాని, ఇత్తడిది గాని,
మట్టిది
గాని వాడవచ్చు. కుందిలో 3 అడ్డవత్తులు
1 కుంభవత్తి
(మధ్యలో)
వేసి నూనెతో తడపవలెను. ఇంకొక అడ్డవట్టి నూనెతో
తడిపి ఏకహారతిలో (కర్పూర హారతికి వాడే వస్తువులు) వేసి ముందుగా
ఏకహారతిలో వేసిన
వత్తిని అగ్గిపుల్లతో
వెలిగించి, వెలిగించిన వత్తితో
కుందిలోని 1 అడ్డవత్తి 1 కుంభవత్తి
వెలిగించవలెను. తర్వాత చేయి
కడుక్కొని నూనె కుంది నిండావేసి పిదప ఆ కుందికి మూడు చోట్ల
కుంకుమ అలంకారము చేయవలెను. తర్వాత
అక్షతలు వేసి
దీపారధను
లక్ష్మీస్వరూపముగా భావించి నమస్కారము చేయవలెను.
కుందిలో మిగిలిన రెండు అడ్డవత్తులు పూజా సమయంలో ధూపము
చూపిన తరువాత దీపము
చూపించుటకు వాడవలెను.
దీపారాధనకు
నువ్వులనూనెగాని, కొబ్బరినూనెగాని, ఆవునెయ్యిగాని వాడవచ్చును.
ఈ విధంగా దీపం వెలిగించి ఘంటను వాయిస్తూ నమస్కరించి
ఈ విధంగా దీపం వెలిగించి ఘంటను వాయిస్తూ నమస్కరించి
ఈ క్రింది శ్లోకమును చదువుకొనవలెను.
ఘంటానాదము:
శ్లో|| ఆగమార్ధంతు దేవానాం గమనార్ధంతు రాక్షసామ్
కుర్యాద్ఘంటారవంత త్ర దేవతా హ్వాహన లాంఛనమ్
మనము ఆచమనము చేసినటువంటి పంచ పాత్రలోని నీళ్ళు
ఘంటానాదము:
శ్లో|| ఆగమార్ధంతు దేవానాం గమనార్ధంతు రాక్షసామ్
కుర్యాద్ఘంటారవంత త్ర దేవతా హ్వాహన లాంఛనమ్
మనము ఆచమనము చేసినటువంటి పంచ పాత్రలోని నీళ్ళు
దేవుని పూజకు
వినియోగించ రాదు. పూజకు
విడిగా ఒక గ్లాసు గాని
,చెంబు గాని
తీసుకుని దానిలో శుద్ధ జలమును పోసి ఆ
చెంబునకు
కలశారాధన చేసి ఆ నీళ్ళు మాత్రమే దేవుని పూజకు ఉపయోగించ వలెను.
పూజకు కావలసిన వస్తువులు : ఏ దేవుని పూజించుచున్నమో
పూజకు కావలసిన వస్తువులు : ఏ దేవుని పూజించుచున్నమో
ఆ దేవుని యొక్క బొమ్మ (ప్రతిమ ) (తమ శక్తి కొలది బంగారముతో
నైనను ,వెండితో
నైనను లేక మట్టితో నైనను తీసుకొనవలెను ),
కొబ్బరి కాయలు , పళ్ళు , పువ్వులు ,పసుపు ,కుంకుమ ,
కొబ్బరి కాయలు , పళ్ళు , పువ్వులు ,పసుపు ,కుంకుమ ,
No comments:
Post a Comment