Sunday, November 10, 2013

నిత్యపూజా విధానము 13




నీరాజనం:
శ్లో|| చంద్రాది త్యౌచ ధరణీ విద్యుదగ్ని స్త దైవ చ


త్వమేవ సర్వజ్యోతీంషి ఆర్తిక్యం ప్రతిగ్రుహ్యతా మ్  ||
ఓం శ్రీ................. నమః నీరాజనం సమర్పయామి అని కర్పూర
 బిళ్ళలు హారతి కుందిలో వేసి ముందుగా దీపారాధనకు 
వెలిగించి దీపంతో వెలిగించి, మూడుమార్లు త్రిప్పుచూ, 
 చిన్నగా గంటవాయించవలెను. అనంతరం మళ్ళీ పువ్వుతో
 నీరు హారతి కుంది చివర వదులుతూ 'కర్పూర నీరాజనానంతరం
 శుద్ధచమనీయం సమర్పయామి' అని చెప్పి నీరాజనం
 స్వామివారికి చూపించి తరువాత ఇంటిలోని వారందరూ
 హారతిని కళ్ళకు అద్దుకోవాలి. తరువాత అక్షతలు, పువ్వులు,.
 చిల్లర డబ్బులు చేతితో పట్టుకొని,

మంత్ర పుష్పం :
శ్లో|| శృతిభి స్మృతిభిర్ధి వ్యై: లౌకికై ర్వచ నైరపి
మంత్రితం కుసుమోపేతం మంత్ర పుష్పం సమర్పయే  ||
ఓం శ్రీ................ నమః యథాశక్తి మంత్రపుష్పం సమర్పయామి 
అని చెప్పుకొని అక్షతలు, పువ్వులు,
 చిల్లరడబ్బులు, స్వామివద్ద ఉంచవలెను.
 పిమ్మట ఈ దిగువ మంత్రం జపిస్తూ మూడుసార్లు ప్రదక్షిణలు చేయాలి.

ప్రదక్షిణం:
శ్లో|| యానికానిచ పాపాని జన్మాంతర కృతానిచ
తానితాని ప్రణశ్యంతి ప్రదక్షిణ పదే పదే               ||

పాపోహం పాపకర్మా హం పాపాత్మా పాపసంభవః
త్రాహి మాం కృపయా దేవ శరణాగత వత్సల    ||

అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ
తస్మా త్కారుణ్య భావేన రక్ష రక్ష జనార్ధన   ||

ఓం శ్రీ............... నమః ఆత్మ ప్రదక్షిణ నమస్కారాన్ సమర్పయామి.
 శ్రీ స్వామికి చేతిలో అక్షతలు, పువ్వులు, తీసుకొని లేచి నిలబడి
 మూడుసార్లు ఆత్మప్రదక్షిణ చేసి ( అనగా తమలో తాము చుట్టూ తిరిగి)
 పిమ్మట సాష్టాంగ నమస్కారం చేసి
 (మగవారు పూర్తిగా పడుకొని తలను నేలకు ఆన్చి,
 ఆడువారు మోకాళ్ళ పై పడుకొని కుడికాలు ఎడమకాలుపై వేసి) 
తరువాత స్వామిపై చేతిలోనున్న అక్షతలు, పువ్వులు చల్లి మరల
 తమ స్థానమున ఆసీనులై నమస్కరించుచూ............


First   1  2  3  4  5  6  7  8  9  10  11  12  13  14  Last

No comments:

Post a Comment