ఆభరణం:
శ్లో|| స్వభాన సుందరాంగాయ నానాశక్త్యా శ్రయాయతే
భూషణాని విచిత్రాణి కల్పయామ్య మరార్చిత ||
ఓం శ్రీ................నమః ఆభారణాన్
సమర్పయామి అని స్వామికి
మనము చేయించిన
ఆభరణములను అలంకరించవలెను. లేనిచో
అలంకారార్ధం అక్షతాన్
సమర్పయామి అని అక్షతలు స్వామిపై వేసి ఆభరణాన్
సమర్పయామి అని నమస్కరించవలెను.
అక్షతలు:
శ్లో|| అక్షతాన్ ధవళాన్ దివ్యాన్
శాలీయాన్ స్తండులాన్ శుభాన్
గృహాణ పరమానంద శంభు పుత్ర నమోస్తుతే
శ్రీ................... నమః అక్షతాన్ సమర్పయామి.
(అక్షతలు
కొద్ది బియ్యమును తడిపి పసుపువేసి కలుపవలెను)
అక్షతలు తీసుకొని
స్వామివారిపై ప్రతిమ పై చల్లవలెను.
శంభుపుత్ర అన్నచోట ఏ దేవుని పూజిస్తున్నామో
ఆ దేవుని పేరును అనుకొనాలి.
పుష్ప సమర్పణ:
శ్లో|| తురీయ వన సంభూతం నానాగుణ మనోహరమ్
ఆనంద సౌరభం పుష్పం గృహ్యతా మిద ముత్తమమ్
||
శ్రీ.............. నమః పుష్పాణి
సమర్పయామి. స్వామివారికి
పువ్వులతో అలంకారము చేయవలెను.
పిదప అధాంగ పూజను చేయవలెను. అధాంగ
పూజలోని ఒకొక్క
మంత్రమును చదువుతూ స్వామిని అక్షతలతో గాని,
పువ్వులతోగాని పూజించవలెను.
తరువాత అష్టోత్తర శతనామావళి పూజ.
ఇందులో 108
మంత్రములు
ఉంటాయి. ఒకొక్క మంత్రమును చదువుతూ
స్వామిని అక్షతలతో గాని, పువ్వులతో గాని పూజించవలెను.
పిదప అగరువత్తిని వెలిగించి........
ధూపం:
శ్లో|| వనస్పతి సోపేతో గంధాడ్యో గంధ
ఉత్తమః
ఆఘ్రేయః సర్వదేవానాం ధూపోయం
పరిగృహ్యతామ్ ||
ఓం శ్రీ................... నమః
ధూపమా ఘ్రాపయామి. ధూపం సమర్పయామి.
అంటూ ఎడమచేత్తో గంటవాయిస్తూ కుడిచేత్తో
అగరుబత్తి తిప్పుతూ
పొగను స్వామికి చూపవలెను.
No comments:
Post a Comment