Wednesday, November 13, 2013

శ్రీ వినాయక స్వామి వారి చరిత్ర 4





అట్టి ఈ విహార పురికి పక్కగా బహుదా నది ప్రవహిస్తూ న్నది. 
పురాణ ప్రసిద్దంగా బహు దా నదికి సంబదించిన ప్రసిద్ద 
గాధలనే ఇచ్చటి స్థానికులు కూడా 
పదే పదే చెప్పు కొంటు వుంటారు.
 పూర్వం శంఖుడు, లిఖితుడు అనే ఇద్దరు అన్నదమ్ములు 
 స్వయం భువుగా వెలసిన శ్రీ వర సిద్ది వినాయకుని 
మహిమలను గూర్చి విని ఆ స్వామిని దర్శించుట కై ఎంతో 
దూరము నుండి కలి నడకన వస్తు వుంటారు.
 సుదూరం నుండి రావడం వల్ల తము తెచ్చు
కొన్న ఆహారం అయిపొయింది.
ఈ ఇద్దరు అన్నదమ్ములు బాగా అలసిపోయారు. 
విరు నడిచి వస్తున్న దారిలో ఒక మామిడి తోట వుంటుంది.
 తమ్ముడైన లిఖితుడు ఆకలి బాధకు తాళ లేక మామిడి చెట్టు 
 లోని ఒక పండును కోసి తింటానని తన అన్నాను అడుగుతాడు.
 శంఖుడు దానికి ఒప్పుకోడు. 
అది దొంగతన మవుతుందని ఆ పండును తిన
వద్ద ని తమ్మునికి చెబుతాడు. 
 కానీ ఆకలితో అలమటిస్తున్న లిఖితుడు అన్న 
మాటలను పేద చెవిని పెట్టి దొంగతనంగా మామిడి చెట్టు నుండి 
ఒక పండు కోసుకొని తింటాడు. 
ఇట్లు ధర్మ విరుద్దంగా నడుచు కొన్న తన తమ్ముణ్ణి రాజు 
వద్దకు తీసుకోని వెళ్లి తన తమ్ముడు దొంగతనం చేశాడని
 దానికి తగిన శిక్ష విధించామని శంఖుడు రాజునూ కోరతాడు. 
రాజు లిఖితుని రెండు చేతులు నరికి వేయమని 
భటులకు అజ్ఞాపి స్తాడు.
  భటులు లిఖితుని రెండు చేతులూ నరికి వేస్తారు. 
తన తమ్ముడు చేసిన తప్పుకు రాజు ఇంతటి
 ఘోరమైన శిక్ష విధిస్తాడు.
 ఊహించని శంఖుడు దు :ఖిస్తాడు.
 అక్కడ నుండి ఈ అన్నదమ్ములిద్ద రూ స్వామి 
వారిని దర్శించుట కై బయలు దేరుతారు. 
 ముందుగా స్వామి వారి ఆలయం పక్కనే ప్రవహిసున్న
 నదిలో స్నాన మాచరిస్తారు. 
 అప్పుడు వెంటనే లిఖితునికి యధా ప్రకారంగా చేతులూ వస్తాయి.
 నదిలో మునగడం వల్ల బాహువులు వచ్చినాయి,
 కాబట్టి ఈ నదికి బహు దా నది అని పేరు వచ్చింది. 
 నాటి నుండి ఆ అన్నదమ్ము లిరువూరు స్వామి వారి
 మహాత్మ్యాన్ని ప్రచారం చేస్తూ జివి౦ చ సాగారు.


 First  1   2   3  4  5  6  7  8  9  10  11  12   13   Last

No comments:

Post a Comment