Sunday, November 10, 2013

నిత్యపూజా విధానము 6




ఉపాత్త సమస్త దురితక్షయ ద్వారా శ్రీ పరమేశ్వర ముద్దిశ్య
 శ్రీ పరమేశ్వర ప్రీత్యర్ధం పురుషులైనచో శ్రీమాన్ ...........గోత్రస్య 
........నామధేయః, శ్రీమత్యః , గోత్రస్య ,నామదేయస్య అనియు, 
 స్త్రీలైనచో శ్రీమతి , గోత్రవతి , నామదేయవతి, శ్రీమత్యాః , 
గోత్ర వత్యాః, నామధేయవత్యాః , అనియు 
(పూజచేయువారి గోత్రము , నామము చెప్పి ) 
నామదేయస్యః ధర్మపత్నీ సమేతస్యః (పురుషులైనచో )
 మమ సహ కుటుంబస్య ,క్షేమ స్థైర్య, వీర్య , విజయ , 
అభయ ఆయురారోగ్య ఐశ్వర్యాభి వృద్ద్యర్ధం,
 ధర్మార్ధ కామ మోక్ష ఫల పురుషార్ధ సిద్ద్యర్ధం ,
 పుత్ర పౌత్రాభి వృధ్యర్ధం,సకల విధ మనోవాంచాఫల సిద్ద్యర్ధం ,
 (ఏ దేవుని పూజించు చున్నామో ఆ దేవుని యొక్క పేరు చెప్పుకుని )
 దేవతా ముద్దిశ్య,  శ్రీ.......... దేవతా పీత్యర్ధం
 సంభవ ద్భిరుపచారై: సంభవతానియమేన సంభవతాప్రకారేణ యావచ్చక్తి
 (నాకు తోచిన రీతిలో ,నాకు తోచిన నియమములతో ,
 నాకు తోచిన విధముగా ,భక్తి శ్రద్దలతో సమర్పించు కుంటున్న పూజ )
 ధ్యానా వాహనాది షోడశోపచార పూజాం కరిష్యే .
 పిదప కలశారాధనను చేయవలెను.

కలశపూజనుగూర్చినవివరణ :
వెండి, ,రాగి, లేక , కంచు గ్లాసులు (లేదా పంచ పాత్రలు ) 
రెండింటిలో శుద్ధ జలమును తీసుకుని ఒక దానియందు అక్షతలు ,
 తమలపాకు ,పువ్వు ఉంచుకొనవలెను. రెండవ పాత్రకు బయట
 మూడు వైపులా గంధమును వ్రాసి కుంకుమను అద్దవలెను
 ఇట్లు చేయునపుడు గ్లాసును గుండ్రముగా త్రిప్పుచూ గంధమును కాని,
 కుంకుమను గాని
పూయరాదు. గంధమును ఉంగరపు  వ్రేలితో పూయవలెను. 
కుంకుమ అక్షతలు వగైరా బొటన,
మధ్య, ఉంగరపు వ్రేళ్ళను కలిపి సమర్పించ వలెను. యజమానులు
 (ఒక్కరైతే ఒకరు, దంపతులైతే ఇద్దరూను )
 ఆ కలశాన్ని కుడి చేతితో మూసి వుంచి ఇలా అనుకోవాలి .
 ఈ విధముగా కలశమును తయారుచేసి పూజను చేయునపుడు 
మొదటగా ఈ శ్లోకమును చదువవలెను .
           
మం || కలశస్య ముఖే విష్ణు : కంటే రుద్ర స్సమాశ్రితః
మూలే తత్ర స్థితో బ్రహ్మ మధ్యే మాతృ గణా స్మృతాః ||
ఋగ్వేదో ధ యజుర్వేద స్సామవేదో హ్యధర్వణః
అంగైశ్చ సహితా స్సర్వే కలశాంబు సమాశ్రితః

First   1  2  3  4  5  6  7  8  9  10  11  12  13  14  Last

           

No comments:

Post a Comment