Sunday, November 10, 2013

నిత్యపూజా విధానము 14




పునః పూజ :
ఓం..................... నమః పునః పూజాం కరిష్యే అని చెప్పుకొని,  
పంచపాత్రలోని నీటిని చేతితో తాకి, అక్షతలు స్వామిపై చల్లుతూ
 ఈ క్రింది మంత్రములు చదువుకొనవలెను.

విశేషోపచారములు:
ఛత్రం ఆచ్చాదయామి, చామరం వీజయామి, నృత్యం దర్శయామి,
 గీతం శ్రావయామి, వాద్యం ఘోషయామి, సమస్త రాజోపచార,
 శక్త్యోప చార, భక్త్యోపచార పూజాం సమర్పయామి అనుకొని,
 నమస్కరిస్తూ ఈ క్రింది శ్లోకమును చదువుకొనవలెను.

పూజాఫల సమర్పణమ్:
శ్లో|| యస్య స్మృత్యాచ నామోక్త్యా తపం పూజాక్రియాదిషు
యాన సంపూర తాంయాతి సద్యో వందే తమచ్యుతమ్
మంత్ర హీనం క్రియాహీనం భక్తిహీనం మహేశ్వరః
యత్పూజితం మాయాదేవ పరిపూర్ణం తదస్తుతే    ||
అనయా ధ్యానావాహనాది షోడశోపచార పూజయాచ భగవాన్
 సర్వాత్మకః శ్రీ..................... సుప్రీత స్సుప్రసన్నో వరదో భవతు.
ఏతత్ఫలం శ్రీ.................. ర్పణమస్తు అంటూ అక్షతలు నీటితోపాటు 
అరవేణంలో వదలవలెను. పిమ్మట ' శ్రీ....................
. ప్రసాదం శిరసా గృహ్ణామి'
 అనుకొని స్వామివద్ద అక్షతలు తీసుకొని తమ తమ
 తలలపై వేసుకొనవలెను.
 ఆ పిదప పసుపు గణపతి ఉన్న పళ్ళెము
నొకసారి పైకి ఎత్తి నుంచవలెను.
 దీనిని ఉద్వాసన చెప్పటం అంటారు.
ఓం శ్రీ.................. నమః యధాస్థానం ప్రవేశయామి.
 శోభనార్ధం పునరాగమనాయచ. అని ఉద్వాసన పలుకుతారు.
పూజావిధానం సంపూర్ణం.

తీర్ధ ప్రాశనమ్
శ్లో|| అకాల మృత్యు హరణం సర్వవ్యాధి నివారణమ్  |
సమస్త పాపక్షయ కరం శ్రీ.....................
పాదోదకం పావనం శుభమ్  ||
అని తీర్ధమును చేతిలో వేసుకొని మూడుమార్లు
 నోటిలోనికి తీసుకొనవలెను.

First   1  2  3  4  5  6  7  8  9  10  11  12  13  14  Last

No comments:

Post a Comment