Monday, November 11, 2013

నిత్యపూజా విధానము 1




శ్లో|| "అభషేక ప్రియశ్శివః విష్ణుస్త్వంలంకార ప్రియః
| సూర్యో నమస్కార ప్రియః |
గణపతి స్తర్పణ ప్రియః | దేవీ త్వర్చనా ప్రియః ...................................."
శివుడు అభిషేకం వలన ఆనందిస్తాడు. విష్ణువు అలంకార ప్రియుడు.
సూర్యునికి నమస్కారమంటే ఇష్టము. గణపతి తర్పణ ప్రియుడు.
ఆమ్మవారికి అర్చనమంటే ప్రీతి.
 మన భారతీయ సంస్కృతి ఆధ్యాత్మిక పరముగా ఆనాది
 కాలమునుండి సత్కర్మాచరణల పరంపరగా వచ్చుచున్నది.
ఇందులోని భాగమే దేవతలా ఆరాధనము లేక పూజావిధానము.

పూజ చేయుటకు ముఖ్యమైన వస్తువులు:
1 . పూజావేళ ఉపయోగించుటకుగాను విడివిడిగా పాత్రలలో జలము,
 ఉద్దరిణెలు లేదా చెంచాలు కావలెను.
2 . పూజించబోవు దైవము యొక్క చిత్రపటం లేదా ప్రతిమ అవిలేని యెడల
 బంగారు లేదా వెండితో చేసిన కాసు.
3 . దీపారాధనకు కుందెలు, ప్రత్తి వత్తులు, ఆవునెయ్యి,
 వాటిని వెలిగించుటకు అగ్గి పెట్టె -  దూపరాధనకు
 సాంబ్రాణి లేదా అగరువత్తులు .
4 . పూజార్ధం అక్షతలు, పసుపు, కుంకుమ, గంధం,
పువ్వులు, పంచామృతాలు (ఆవుపాలు, ఆవుపెరుగు,
 ఆవునెయ్యి, తేనె, పంచదార), మధుపర్కం వస్త్ర యుగ్మం
5 . ప్రధానంగా కలశం, దానిఅపికి ఒక కొబ్బరికాయ,
రవికెలగుడ్డ, ప్రత్యేక పూజకొరకు కావలెను.
6 . ఇతర ఉపచారార్ధం - తమలపాకులు (తాంబూలం కొరకు)
 వక్కలు, హారతి కర్పూరం, కొబ్బరికాయలు.
7 . అవసర నైవేద్యానికి గుడకలశం (బెల్లంముక్క),
 కదళీ (అరటి), నారికేళ ఫలాలు (కొబ్బరికాయలు) కావాలి.
8 . వరలక్ష్మీ పూజకు, వినాయక పూజకు 'పాలవెల్లి' కట్టి తీరవలెను.
9 . వినాయకచవితికి పూజక్కు తప్పనిసరిగా 21 రకముల
పత్రికావలెను. 21  ఉండ్రములు కావలెను. తక్కిన వన్నియు
 రకమునకు 21 గా నివేదించవలెను.
10 . స్త్రీదేవతారాధనలో చలిమిడి (గుడపిష్టం/ శర్కర పిష్టం
 అనగా బెల్లం లేదా చెక్కెరతో చేసిన), ముద్గ సూపం
(వడపప్పు - పెసరపప్పు ), పానకం (బెల్లందైతే గుడపానీయం/
 చెక్కెర దయితే శర్కర పానీయం ప్రధానావసరం.
11 . సూర్యునికి పాయసం ప్రధాన నివేదనం. ఇతరాలు యధాశక్తి.
12 . సూర్యరాధనలో రథంలో ఉన్న సూర్యుడి ప్రతిమను చేయించి
 మండపంలో ఉంచి ఆరాధించాలి.
13 . అనంత పద్మనాభ వ్రతానికి అనంత స్వామిని దర్భలతో
 నిర్మించి పూజించాలి.
14 . పూజలలో ఇంకా మండపాల నిమిత్తం –
పండ్లు, బియ్యం కూడా అవసముంటాయి.
15 . పైన చెప్పిన నివేదనలే కాక, భక్తుల తమ శక్తి మేరకు పప్పు,
పెరుగు, కూరలు, నెయ్యి, పాలు మొదలైన విశేషాలతో
షడ్రసయుక్తముగా భక్ష్య భోజ్య లేహ్య చోష్య  పానీయాది
 సంభరితంగా నివేదనలు సమర్పించవచ్చును.

16 . అనంత, వరలక్ష్మీ, కేదారేశ్వర వ్రతాలకు తోరాలు చాలా
ముఖ్యంగా గుర్తించాలి.


First   1  2  3  4  5  6  7  8  9  10  11  12  13  14  Last



No comments:

Post a Comment