షోడశోపచార పూజావిధనాము:
మన యింటికి ఎవరైనా పెద్దలు వస్తే - ఆదరంగా ఆహ్వానించి ఎలా
మర్యాద చేస్తామో, అదే విధంగా మన ఇష్టదైవాన్ని
కూడా 16 రకాల ఉపచారాలతో సేవించుకోవడాన్ని
షోడశోపచార పూజ అంటారు.
అన్ని దేవతా పూజలలోనూ ఈ విధానాన్ని పాటించడం సంప్రదాయం.
1 . ఆవాహనము: మన ఇంటిలోకి మనస్పూర్తిగా ఆహ్వానించడం
2 . అర్ఘ్యము: కాళ్ళు చేతులూ కడుగుకోడానికి నీళ్ళను అందీయడం
3 . పాద్యము: కాళ్ళు చేతులూ కడుగుకోడానికి నీళ్ళను అందీయడం
4 . ఆసనము: ఆ పెద్దలు కూర్చునేందుకు
తగిన ఆసనాన్ని ఏర్పాటు చేయడం
5 . ఆచమనీయం: దాహం (మంచి నీళ్ళు )ఇవ్వడం
6 . స్నానము: ప్రయాణ అలసట తొలగే నిమిత్తం స్నానం వగైరా ఏర్పాట్లు.
7 . వస్త్రము: స్నానంతరం ధరించేందుకు మ(పొ)డి బట్టల నీయడం.
8 . యజ్ఞోపవీతం: మార్గ మధ్యంలో మైలపడిన యజ్ఞోపవీతాన్ని మార్చడం
9 . గంధము: శరీరాన్ని చల్లదనమూ, సుగంధమూ కలిగేలా గంధాన్ని
చల్లడం లేదా చిలకరించడం
10 . పుష్పము: వాళ్ళు కూడా సుగంధాన్ని ఆస్వాదించేలా ఏర్పాటు.
11 . ధూపము: సుగంధ వాతావరణాన్ని కల్పించడం
12 . దీపము: చీకట్లో ఉంచకూడదు. కాబట్టి వెలుతురు కోసం,
పరస్పరం పోల్చుకోవడానికి అనుకూలత కోసం దీపం పెట్టాలి.
దీపము వెలిగించిన తరువాత కుమ్డికి మూడువైపులా కుంకుమ
అద్ది నమస్కరించవలెను.
13 . నైవేద్యము: తన తాహాతురిత్యా తనకై సమకూర్చుకొన్న
దానినే దైవదత్తంగా భావించి - ముందుగా ఆ దైవానికే అర్పించడం.
14 . తాంబూలము: మనం భక్తితో యిచ్చిన పదార్ధాలవల్ల వారి
ఇష్టాష్టాలకి (రుచులకి) కలిగే లోపాన్ని తొలగించడం.
15 . నమస్కారం: మనం చేసిన మర్యాదలలో లోపాన్ని
మన్నించమని కోరడం.
16 . ప్రదక్షిణము: దైవం యొక్క గొప్పదనాన్ని
త్రికరణశుద్ధిగా అంగీకరించడం.
ఈ విధముగానే సర్వదేవతలను భక్తిభావనచే ఆరాధించవలెను.
ముఖ్యముగా నిత్యము చేయు పూజావిధానములో
ఈ విధముగా చేయవలెను.
శ్లో|| గురుబ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః
గురుస్సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః ||
No comments:
Post a Comment