కుజగ్రహం దోషం తొలగిపోవాలంటే మంగళవారం రోజు మంచి పగడం ధరించడం
మంచిది. సుబ్రహ్మణ్య స్వామివారి పూజలు, కుజ మంత్రంతో అనుసంధానం జేసి మంగళవారం రోజు పగడాన్ని ధరించడం ద్వారా
కుజగ్రహ దోషాలు తొలగిపోతాయి. కుజగ్రహ ప్రభావంతో వచ్చే అంటువ్యాధులు తొలగిపోవటానికి ఎర్రని
వస్త్రాలు ధరించడం, ఎరుపు రంగు
కిటికీ గ్లాసులు కలిగి ఎరుపు రంగు పెయింట్ వేయబడిన గది గోడల మధ్య ఉండటం మంచిది.
పగడం ఎర్రని కాంతి పుంజాలను విరజిమ్మే ఉష్ణతత్వం గల రత్నం కావడంతో పగడాన్ని
ధరించడం మంచిది.
అలాగే రవిగ్రహ దోషాల నుంచి
బయటపడాలంటే కెంపును ధరించడం మంచిది. అలాగే ఎరుపు రంగు, ఎర్రని పూలు, ఎర్రని వస్త్రధారణ, ఎర్రని వస్తువులు, ఆహారధాన్యాల దానం వంటివి రవిగ్రహ దోష నివారకాలని రత్నాలశాస్త్ర నిపుణులు
సూచిస్తున్నారు.
No comments:
Post a Comment