మీ ఇంటి స్థలం ఎక్కువ అయినప్పుడు పూల కుండీలను, చెట్లను పెంచడం మంచిదేనని ఫెంగ్షుయ్ నిపుణులు
అంటున్నారు. నైరుతిలో, ఆగ్నేయంలో పెద్ద చెట్లు ఉండటం మంచిది.
ఈశాన్యంలోని వృక్షాలు ఇంటిలోని మహవారికి హానికరాలు. కాబట్టి పై రెండు దిశల్లో వృక్షాలు మీ ఇంటి బయటి
స్థలానికి దగ్గరగా ఉన్నా ఫలితాలు పైవిధంగానే ఉన్నాయని ఫెంగ్షుయ్ నిపుణులు
చెబుతున్నారు. దుష్ఫలితాలు కలిగించగల ఏ దిశలో చెట్టున్నా దాని వైపుగా మీ ఇంటిలో
ఉన్న కిటికీలో ఓ చిన్న మామూలు అద్దం పెట్టడం శ్రేయస్కరం.
కానీ మొక్కలు ఫలానా దిశలో
పెట్టరాదు అన్న అనుమానం వద్దు. ఇంట్లో మొక్కలు పెంచడం ఇంట్లో దోషమున్న చోట
ఆక్సిజన్ నింపడమే. దోషంలోని విషవాయువును లేదా కార్బన్-డై-ఆక్సైడ్ అవి
పీల్చుకుంటాయి. అలాగే ఒక దిశలో మొక్కలు పెంచితే ఆ దిశకు సంబంధించిన రంగు బల్బు
పెట్టడం మరిచిపోకూడదు.
No comments:
Post a Comment