Tuesday, October 22, 2013

కార్తిక పురాణం 19 (10 వ అధ్యాయము ) అజామీరుని పూర్వ జన్మ వృత్తాంతము

కార్తిక మాసం 19
10 వ అధ్యాయము
అజామీళుని పూర్వ జన్మ వృత్తాంతము
జనకుడు వశిష్టుల వారిని గాంచి " ముని శ్రేష్ఠ !
 యీ అజా మీళుడు యెవడు? వాడి పూర్వ జన్మ మెటువంటిది?
 పూర్వ జన్మంబున నెట్టి పాపములు చేసియుండెను? 
ఇప్పడీ విష్ణు దూతలు వైకుంటమునకు తీసుకొనిపోయిన తరువాత నేమి జరిగెను?
 వివరించ వలసినది " గాప్రార్ధించెను. 
అంత నా మునిశ్రేష్టుడు జనక మహారాజును గాంచి యిట్లు పలికెను.
జనకా!
 అజా మీ ళుని విష్ణు దూతలు వైకున్తమునకు తీసుకొనిపోయిన తరువాత
 యమ కింకరులు తమ ప్రభువగు యమ ధర్మ రాజు కదా కేగి,
 " ప్రభూ! తమ అజ్ఞ ప్రకారము అజా మీ ళుని తీసుకొని వచ్చుటకు
 వెళ్ళగా అచ్చటకు విష్ణు దూతలు కూడా వచ్చి మాతో వాదించి 
 అజామీళుని విమాన మెక్కించి వైకుంట మునకు దీసుకొని పోయిరి.
 మేము చేయునది లేక చాల విచారించుచూ యిచటకు వచ్చినారము' 
అని భయ కి౦ పితులై విన్నవి౦చు కొనిరి.
"జా రా! ఎంత పని జరిగెను? ఎప్పుడూ ఇట్టి విధముగా జరిగి యుండలేదే? 
దీనికి బలమైన కారణము ఏదైనా వుండి యుండవచ్చును"
 అని యముడు తన దివ్య దృష్టితో అజా మీళుని పూర్వ జన్మ
 వృ త్తాంతము తెలుసుకొని " ఓహొ! అది యా సంగతి!
 తన అవ సాన కాలమున " నారాయణ" అని వైకుంట వాసుని స్మరణ జేసి యుండెను.
 అందులకు గాను విష్ణు దూతలు వచ్చి వానిని తీసుకొని పోయిరి.
 తెలియక గాని, తెలిసిగాని ముత్యు సమయమున హరి నామ
 స్మరణ మెవరు చేయుదురో వారికి వైకుంట ప్రాప్తి తప్పక కలుగును.
 గనుక, అజా మీ ళునకు వైకుంట ప్రాప్తి కలిగెను కదా!" అని అనుకొనెను.
అజా మీ ళుడు పూర్వ జన్మలో మహారాష్ట్ర దేశమున ఒకానొక
 శివాలయములో అర్చకుడుగా నుండెను.
 అతడు అపురూపమైన అందంచేతను, సిరి సంపదల చేతను,
 బలము చేతను గర్విష్టి యై శివారాధన చేయక, 
శివాలయము యొక్క ధనము నపహరించుచు, 
శివుని విగ్రహము వద్ద ధూప దీప నైవేద్యములను బెట్టక,
 దుష్ట సహవసములను మరిగి విచ్చలవిడిగా తిరుగు చుండెడి వాడు. 
ఒక్కొక్క ప్పుడు శివాలయములో పరమేశ్వరుని 
కెదురుగా పాదములుంచి పరు౦డెడి వాడు.
 ఇతని కొక బిద బ్రాహ్మణ స్త్రీ తో రహస్య సంబంద ముండెడిది. 
ఆమె కూడా అందమైనద గు టచే చేయునది లేక ఆమె భర్త చూచియు 
చూడ నటుల నుండి భిక్షాటనకై వురూరా తిరుగుచూ ఏదో వేళకు 
యింటికి వచ్చి కలం గడుపుచు౦డెడి వాడు. 
ఒకనాడు పొరుగూరికి వెళ్లి యాచన చేసి పెద్ద మూటతో బియ్యము 
కూరలు నెత్తిని బెట్టుకొని వచ్చి అలిసిపోయి " నాకు యీ రొజున
 ఆకలి మిక్కుటముగా నున్నది త్వరగా వంట చేసి పెట్టుము",
 అని భార్యతో ననెను. అందులకామె చిదరించుకోనుచు, 
నిర్లక్ష్యముతో కళ్ళు కడుగుకొనుటకు నీళ్లు కూడా యీయక, అతని

   First     15   16    17   18  19  20 21 22  23   24   25   26  27    28  29  30  31   Last

No comments:

Post a Comment