Wednesday, October 23, 2013

కార్తిక పురాణం 3 కార్తీక సోమవార ఫలముచే కుక్క కైలాస మ౦దుట

కార్తిక మాసం3

 కార్తీక సోమవార ఫలముచే కుక్క కైలాస మ౦దుట
పూర్వ కాలమున కాశ్మీర దేశములో ఒక బ్రాహ్మణుడు కలడు.

 అతడు పురోహిత వృతిని చేపట్టి తన కుటు౦బమును పోషించుకుంటూ ఉండెను. 
అతనికి చాల దినములుకు 
 ఒక కుమార్తె కలిగెను. ఆమె పేరు'స్వాతంత్ర నిష్టురి ' తండ్రి ఆమెకు 
సౌరాష్ట్ర  దేశియుడగు మిత్ర శర్మ యను సద్బ్రాహ్మణ యువకున కిచ్చి పెండ్లి చేసెను.
 ఆ బ్రాహ్మణ యువకుడు నాలుగు వేదములు, శాస్త్రములు అబ్యాసించిన
 వాడైన౦దున సదాచార పరాయణుడై యుండెను. అతడు భూతదయ గల్గిన వాడు. 
నిత్య సత్య వాది. 
నిరంతరం భగవన్నామస్మరణ చేయువాడను యగుటచే లోకులేల్లరునతనిని
 'అపరబ్రహ్మ' అని కూడ చెప్పుకొను చు౦ డేడివారు. 
ఇటువంటి ఉత్తమ పురుషుని భార్యయగు నిష్టురి యవ్వన గర్వముతో, 
కన్ను మిన్ను గానక పెద్దలను
దుషించుచు - అత్తమామలను, భర్తను తిట్టుచు, గొట్టుచు, 

రక్కుచు పరపురుష సా౦గత్యము గలదై, 
వ్యభిచారిణియై తన ప్రియులు తెచ్చిన తినుబండారములు , బట్టలు పువ్వులు, 
ధరించుచు దుష్టురాలై తిరుగుచుండగా వంశమునకు అప్రతిష్ట తెచ్చు చున్నదని అత్తమామలు
 ఆమెను తమ ఇంటి నుండి వెడలగొట్టిరి. కానీ, శాంత స్వరుపుడగు ఆమె
  భర్తకు మత్రమా మెయ౦దభిమానము పోక, 
ఆమె ఎంతటి నీచ కార్యములు  చేసినను సహించి, "చీ పోమ్మనక ,
 విడువక, ఆమెతోడనే కాపురము చేయుచుండెను.
 కానీ, చుట్టుప్రక్కల వారి నిష్టురి గయ్యాళి తనమును కేవగించుకుని - ఆమెను
 ' కర్కశ' అనే ఎగతాళి పేరును పెట్టుటచే- అది మొదలందరూ దానిని 'కర్కశా'
 అనియే పిలుస్తూ వుండేవారు.

ఇట్లు కొంత కాలము జరిగిన పైన - ఆ కర్కశ , ఒకనాటి రాత్రి  తన భర్త గాడా 
నిద్రలో నున్న సమయము చూచి, మెల్లగా లేచి, తాళి కట్టిన భర్త యన్న విచక్షణ గాని,
 దయాదాక్షి న్యాలుగాని లేక, 
ఒక బండ రాతిని తెచ్చి అతని తలపై గట్టిగా కొట్టినది. వెంటనే యతడు చనిపోయెను. 
ఆ మృత దేహమును ఎవరి సహాయము అక్కర్లేకనే, అతి రహస్య౦గా దొడ్డి దారిని గొ౦పొయీ
 ఊరి చివరనున్న పాడు  నూతిలో బడవైచి పైన చెత్త చెదరములతో నింపి, యేమియు 
యెరుగని దానివలె ఇంటికి వచ్చెను. 
 ఇక  తనకు యే ఆట౦కములు లేవని ఇంక విచ్చల విడిగా సంచరించుచు,
 తన సౌందర్య౦ చూపి యెందరినో క్రీ గ౦టనే వశపరచుకొని, వారల వ్రతమును 
పాడుచేసి నానాజాతి పురుషులతో డ నూరమిన్చుచు వర్ణ సంకరు రా లయ్యెను. 
 అంతేయే గాక పడుచు కన్యలను, భర్తతో కాపురము చేయుచున్న పడుచులను,
 తమ మాటలతో చేరదీసి, వారి క్కూడా దుర్భుదులు నేర్పి పాడు చేసి,
 వితులకు తార్చి ధనార్జన కూడ చేయసాగాను.

 First   01   1   2   3  4   5    6   7   8    9  10   11  12  13   14   15   16   Last 

No comments:

Post a Comment