Tuesday, October 8, 2013

శ్రీ లింగ పురాణము13







ఇట్లుండగా కేరళ దేశమున బాలించు రాజు ఏటేల కాళికా పూజలు చేసిన బలియిచ్చు చుండెడివాడు. అతడు నర బలికై నరుని తెండ నిభటులను బంపెను. వారు తిరిగి శాంతుని సంగతి విని వాని తల్లిదండ్రులతో " మా రాజు మీకు కోరినంత ధన మిచ్చును. పనికి రాని కుమారుడుండి మీకు పయోగ మేమి? వానిని కాళికి బలిగా నిచ్చినచో వాని జన్మము తరించును. మీకు ధనము లభించు" నని చెప్పగా తండ్రి ధనాశ చేత కొడుకును వారికి అమ్మివేసెను. వారత నిని గొనిపోయి రాజున కొప్పగించిరి. అతడు వీనిని బలికి అలంకరింపుడని చెప్పి, తాను పూజలో కూర్చుండెను. పురోహితుడు నిర్దయుడు. అమాయకుడైన శాంతుని బలివేళ, అమ్మవారి గుడి లోనికి ద్రోసి తలుపులు బిగించెను. ఆది శక్తి మాంసనిష్ఠ గనుక ఉగ్ర రూపమును ధరించి అతనిని మ్రింగ బోయెను. శాంతుడు పంచాక్షరీ జపము చేసి కొనుచుండెను. ఆ దేవి వానిని తాక లేక పోయెను. ఏమని చూడగా, వాని కంఠమున రుద్రాక్ష పూసయు, నోట పంచాక్షరీ మంత్రమును ఉండుట గమనించి, ఇట్టి పరమశివ భక్తుని తనకు బలిగా సమర్పించిన పురోహితుని భస్మము చేసి, శాంతునితో, " నీవు మహానుభావుడవు. నీ కపకారము చేయుట నాతప్పు. ఈ రాజు తన పాపమునకు ప్రాయశ్చిత్తముగా తన కూతురును నీ కిచ్చి పెండ్లి చేసి అర్ద రాజ్య మిచ్చునట్లు చేసెదను. నీవు పంచాక్షరీ ప్రభావమున సకల విద్యా వేత్తవు అగుడవు. నీ కేమి వరము కావలెనోకొరు" మనెను.

First   2  3  4  5  6  7  8  9  10  11  12  13  Last

No comments:

Post a Comment