Sunday, October 20, 2013

కార్తిక పురాణం-56(28 వ అధ్యాయము)

కార్తిక మాసం 56
28 వ అధ్యాయము
విష్ణు సుదర్శన చక్ర మహిమ
జనక మహారాజా! వింటి వా దుర్వాసుని అవస్ధలు! 
తాను యెంతటి కోపవంతు డైనను, వెనుక ముందు లాలో చింపక మహాభక్తుని శుద్ధ 
ని శంకించినాడు కనుక నే అట్టి ప్రయాసముల పాలైనాడు.
 కావున, ఎంతటి గొప్ప వారైనాను వారు ఆచరించు కార్యములు జాగ్రత్తగా తెలుసుకోన వలెను.
 అటుల దుర్వాసుడు శ్రీ మన్నారాయణుని కడ సెలవుపొంది 
తనను వెన్నంటి తరుముచున్న విష్ణు చక్రాన్ని చూచి భయపదుచూ
 తిరిగి మళ్లి భూలోకానికి వచ్చి అంబరీ షుని కడ కేగి " అంబరీ షా,
 ధర్మ పాలకా! నా తప్పు క్షమించి నన్ను రక్షింపుము,
 నీకు నా పైగల అనురాగముతో ద్వాద శి పారాయణ మునకు నన్నాహ్వనించితివి,
 కాని నిన్ను కష్టములు పాలుజే సి వ్రత భంగ ము చే యించి నీ పుణ్య ఫలమును
 నాశనము చేయతల పెట్టి తిని. 
గాని నా దుర్బద్ది నన్నే వెంటాడి నాప్రాణములు తీయుటకే సిద్ద మైనది. 
నేను విష్ణువు కడ కేగి యా విష్ణు చక్రము వలన ఆపద నుండి రక్షింపుమని ప్రార్ధి౦ చితిని.
 ఆ పురాణ పురుషుడు నాకు జ్ఞానో దయము చేసినీ వద్ద కేగ మని చెప్పినాడు.
 కాన నీవే నాకు శరణ్యము.
 నేను యెంతటి త పశ్శాలి నైనను, యెంత నిష్ట గలవాడ నైనను 
నీ నిష్కళంక భ క్తి ముంద వియేమియు పనిచెయలేదు. నన్ని విపత్తు నుండి కాపాడు 
" మని అనేక విధాల ప్రార్ధoచగా,
 అంబరీ షుడు శ్రీ మన్నారాయణుని ధ్యానించి,"ఓ సుదర్శన చక్రమా! 
 నీ కి వే నా మన: పూర్వక వందనములు. ఈ దూర్వా సమహాముని తెలిసియో, 
తెలియక యో తొందర పాటుగా యీ కష్ట మును కొని తెచ్చుకొనెను.
 అయిన ను యీత డు బ్రాహ్మణుడు గాన, ఈత నిని చంపవలదు, 
ఒక వేళ నీ కర్త వ్యమును నిర్వహిం పతలచితి వేని, ముందు నన్నుచంపి,
 తర్వాత ఈ దుర్వాసుని జంపుము.
 నీ మన్నారాయణుని ఆయుధానివి, నేను ఆ శ్రీ మన్నారాయణుని భక్తుడను.
 నాకు శ్రీ మన్నారాయణుడు యిలవేల్పు, దైవము.
 నీవు శ్రీహరి చేతిలో నుండి అనెక యుద్ద ములలో , 
అనేక మంది లోక కంటకులను చంపితివిగాని శరణుగోరువారి ని యింత వరకు చంపలేదు.
 అందువలన నే యీ దుర్వాసుడు ముల్లో కములు తిరిగినను ఈతనిని 
వెంటాడుచునే యున్నావు గాని చంపుటలేదు.
 దేవా! సురా సురాది భూత కొటులన్నియు ఒక్కటి గా యేక మైన నూ నిన్నేమియు చెయ జాలవు,
 నీ శక్తి కి యే విధ మైన అడ్డునూలేదు. 
ఈ విషయము లో క మంతటికి తెలియును. అయిన ను ముని 
పుంగ వునికి యే అపాయము కలుగకుండ రక్షింపుమని ప్రార్దoచుచున్నాను.
 నీ యుందు ఆ శ్రీ మన్నారాయణుని శక్తి యిమిడి యున్నది. 
నిన్ను వేడుకోనుచున్న నన్నును, శరణు వేడిన యీ దుర్వాసుని రక్షింపుము"
 అని అనేక విధ ముల స్తుతించుట వలన అతి రౌద్రాకారముతో నిప్పులు
 గ్రక్కుచున్న విష్ణుచక్రా యుధము అంబరీ షుని ప్రార్ద నలకు శాంతించి" 
ఓ భక్త గ్రే శ్వరా ! అంబరీ షా! నీ భక్తీ ని పరీక్షించుట కిట్లు చేసితినిగాని వేరుగాదు.
 అత్యంత దుర్మార్గులు, మహా పరాక్రమవంతు లైన మధు కైటభులను- దేవతలందరు 
యెక మైకూడ- చంపజాలని మూర్ఖులను నేను దునుమాడుట 
నీ వెరుంగుదువు కదా! ఈ లోక ములో దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ కై శ్రీహరి నన్ను
 వినియోగించి ముల్లో క ములందు ధర్మమును స్దాపించుచుండును.
First    45  46  47  48  49  50  51  52  53  54  55  56  57  58  59  60  61 Last

No comments:

Post a Comment