Thursday, October 24, 2013

శ్రీ శివ (ప్రత్యేక) పూజ-1

ఓం శివానుగ్రహ సిద్ధిరస్తు - శుచిర్భూతులై ముందుగా శివలింగం కదపకుండా 
దానిమీది నిర్మాల్యాలను తొలగించి, అనంతరం పూర్వోక్త పూజా 
విధానాలలాగే సమంత్రకంగా భూశుద్ధి లాంచన మార్జనాదులాచరించి - 
దిగువ విధంగా స్మరించుకోవాలి.

స్మరణ మంత్రం
ఓంకారం ప్రణవం వందే |  ఓంకారం పరమాత్మకం
ఓంకారం శివరూపంచ | శివజ్ఞాన పరేతరా | (అని స్మరించుకోవాలి)

విభూతీ ధారణ మంత్రం:
లలాటంతు మహాదేవం| నాభిం చైవ మహేశ్వర
హృదయం శంకరం జ్ఞేయం | కంటేచ వృషభ ధ్వజం |

భుజాగ్రే శూలపాణించ | మధ్యే కామంగ నాశనం
కరాగ్రే దేవ దేవేశం | శ్రీ కంటః వామ సద్భుజం  ||

తన్మధ్యే ఈశ్వరం ప్రోక్తం | తదగ్రే పార్వతీ ప్రియం
కరౌద్వౌ శివరుద్రం చ | కర్ణౌ చైవ మహేశ్వరం ||

బహి: కంటే పశుపతి: శిరః ప్రీతో సదాశివం
స్మరే దేతాని నామాని | త్రిపుండ్రం ధారయే త్సదా  ||
(అనే మంత్రంతో ఆయానామాలతో ఆయాస్థానాలలో వీభూదిని
 ధరించి ముందుగా గణవదనం చేయాలి.)

గణవందనం మంత్రం
ఓం శ్రీమహాగణాధి పతయే నమః |
శ్రీ నంది భ్రుంగిరిటి వీరక వీరభద్ర చండీశ్వర ప్రమాద ముఖ్య మహాగణేభ్య:  |
శ్రీరుద్ర మంత్రం నుత సహస్రకోటి భ్రుతయేన ముహురస్తు నమోమహద్భ్యః
(నమస్కరించుకుని, దీపారాధన చేసి ఆచమనం చేయాలి)

 First  1   2   3  4  5   Last

No comments:

Post a Comment