Tuesday, October 22, 2013

కార్తిక పురాణం 26

కార్తిక మాసం 26
13 వ అధ్యాయము
కన్య దన ఫలము
ఓ జనక చక్రవర్తీ! కార్తీక మాసములో యింకనువిధిగా చేయవలసిన ధర్మములు చాల యున్నవి. వాటిని వివరించెదను. సావధాను డై అలకి౦పుము. కార్తీక మాసములో నదీస్నాం ముఖ్యము. దాని కంటే ఒక పేద బ్రాహ్మణుని కుమారునకు ఉపనయనము చేయుట ముఖ్యము. ఒక వేళ ఉపనయమునకు అగు ఖర్చు అంతయు భరింప శక్యము కానప్పుడు మంత్రాక్ష తలు , దక్షణ తా౦బూలాది. సంభావనలతో తృప్తి పరచినాను ఫలము కలుగును. ఈ విధముగా ఒక పేద బ్రాహ్మణుని బాలునికి ఉపనయనము చేసిన యెడల యెంతటి మహా పాపములు చేసియున్నాను, అ పాపములన్నియు పోవును.ఎన్ని నూతులూ, తటాకములూ త్రవ్వించిన నూ పై చెప్పినట్లుగా ఒక బ్రహ్మని బాలునికి ఉపనయనము చేసిన౦దు వలన వచ్చు ఫలమునకు సరితుగావు. అంత కన్న ముఖ్యమైనది కన్యాదానము 
కార్తీక మాసములో భక్తి శ్రద్దలతో కన్య దానము చేసిన యెడల 
తను తరించుటయే గాక తన పితృ దేవతలను కూడా తరింప జేసినా వాడగును. 
ఇందులకొక యితిహాసం గలదు. చెప్పెదను. శ్రద్దగా అలకి౦పుము.
సువీర చరిత్రము
ద్వాపర యుగములో వంగ దేశములో గొప్ప పరాక్రమ వంతుడు, 
శూరుడు అయిన " సువిరు"డను ఒక రాజుండెను.
 అతనికి రుప వతియను భార్య కలదు.
 ఒక సారి సువిరుడు శత్రు రాజులచే ఓడింప బడిన వాడయి. 
భార్యతో అరణ్యమునకు పారిపోయి ధన హినుడయి నర్మదా నదీ తీరమందు 
పర్ణ శాలను నిర్మించుకొని కంద మూలా ఫలాదులను 
భక్షించుచు కాలము గడుపు చుండెను.
 కొన్ని రోజుల కాతని భార్య ఒక బాలికను కనెను. 
అ బిడ్డను అతి గారాబముతో పెంచు చుండిరి. 
క్షత్రియ వంశమందు జన్మించిన అ బాలికను ఆహారాది సదుపాయములు
 సరిగా లేకపోయిన ప్పటికి శుక్ల పక్ష చంద్రు నివలెది నదినాభి వృద్ధి నొందుచు,
 అతి గారబముతో పెరుగు చుండెను,
 ఆమె చూచు వార లకు కనుల పండువుగా,
 ముద్దులొలుకు మాటలతో చాలా ముచ్చటగా నుండెను. 
దినములు గడిచిన కొలదీ, బాలికకు నిండు యౌవన దశ వచ్చెను.
 ఒక దినము వాన ప్రస్థుని కుమారుడా బాలికను గాంచి అనే అంద
 ఛందములకు పరవశుడై అ బాలికను తన కిచ్చి పెండ్లి చేయమని అ రాజునూ కోరెను.
 అందులకా రాజు' ఓ ముని పుత్రా! ప్రస్తుతము నేను కడు 
 బిద స్థితిలో నున్నాను. 
అష్ట దరిద్రములు అనుభవించుచున్నాను. 
మా కష్టములు తోలుగుటకు గాను నాకు కొంత దానమిచ్చిన యెడల 
నా కుమార్తెనిచ్చి పెండ్లి చేతు'నని చెప్పగా తన చేతోలో రాగి పైసా యైన నూ
 లేకపోవుటచే బాలిక పై నున్న మక్కువతో అ ముని కుమారుడు నర్మదా 
తీరమున కుబేరుని గూర్చి ఘోర తపమాచరించి, కుబేరుని మెప్పించి దన పాత్రా సంపాది౦చెను.
 రాజు అ పాత్రను పుచ్చుకొని, సంతోషించి,
 తన కుమార్తెను ముని కుమారునికిచ్చి పెండ్లి చేసి నూతన
 దంపతులనిద్దరిని అత్త వారింటికి పంపెను.

   First     15   16    17   18  19  20 21 22  23   24   25   26  27    28  29  30  31   Last

No comments:

Post a Comment