Wednesday, October 23, 2013

కార్తిక పురాణం 2 సోమవార వ్రత మహిమ


 కార్తిక మాసం2


సోమవార వ్రత మహిమ
జనకా! ఇంతవరకు నీకు కార్తీక మాసము న౦దాచరించవలసిన 
 విధి కార్యక్రమము మాత్రమే తెలియజేసితిని. కార్తిక మాసములో
 సోమవార వ్రతమునకు ప్రత్యేక ప్రాముఖ్యము గలదు.
 కానీ, సోమవార వ్రత విధానమునూ,
 దాని మహిమనూ గురించి వివరింతును. సావదానుడవై ఆలకించుము.
 కార్తిక మాసములో సోమవారము శివునకు అత్యంత ప్రీతికరమైన రోజు. 
ఆ రోజున స్త్రీ గాని, పురుషుడుగాని ఏజాతి వారైనా గాని రోజంతయు వుపవాసము౦డి, 
నది స్నానము చేసి తమశక్తి
కొలది దానధర్మములు చేసి నిష్టతో శివదేవునకు బిల్వ పత్రములతో అబిషేకము చేసి, 
 సాయంత్రము నక్షత్ర దర్శనము చేసిన తరువాత భుజించవలయును.
ఈ విధముగా నిష్టతో నుండి ఆరాత్రి యంతయు జాగరణ చేసి పురాణ పటన మొనరించి
 తెల్లవారిన తరువాత నదికి వెళ్లి స్నాన మాచరించి, తిలాదానము చేసి, 
తమశక్తి కొలది పేదలకు అన్నదానము చేయవలెను.
 అటుల చేయ లేనివారు కనీసము ముగ్గురు బ్రాహ్మణుల కైనను తృప్తిగా 
 భోజనము పెట్టి, తాము భుజించవలయును. ఉండ గలిగిన వారు 
సోమవారమునాడు రెండుపూటలా భోజనముగాని యే విధమైన ఫలహరముగని
 తేసుకోనకుండా ఉండుట మంచిది.
 ఇట్లు కార్తిక మాసమందు వచ్చు సోమవార వ్రతమును చేసిన యెడల పరమేశ్వరుడు 
 కైలాస ప్రాప్తి కలిగించి, శివ పూజ చేసినచో కైలాస ప్రాప్తియు - విష్ణు పూజ చేసినచో 
వైకుంట ప్రాప్తియు నొందును. 
దీనిని ఉదాహరణముగ నొక ఇతిహాసము కలదు. దానిని నీకు తెలియబరిచెదను శ్రద్దగా వినుము.

 First   01   1   2   3  4   5    6   7   8    9  10   11  12  13   14   15   16   Last 

No comments:

Post a Comment