Sunday, October 20, 2013

కార్తిక పురాణం-58(29 వ అధ్యాయము)

కార్తిక మాసం 58
29 వ అధ్యాయము
అంబరీషుడు దుర్వాసుని పూజించుట - 
ద్వాదశి పార యణము అత్రి మహా ముని అగస్త్యు వారితో యీ విషముగా-
 సుదర్శన చక్రము అంబరీషునక భయ మిచ్చి వు భయులను రక్షించి, 
భక్త కోతికి దర్శన మిచ్చి అంతర్ధాన మైన వైనము చెప్పి తిరిగి ఇట్లు నడువ నారంభించెను. 
ఆ తరువాత అంబరీషుడు దుర్వాసుని పదముల ఫై బడి దండ
 ప్రణామము లాచరించి, పదములని కడిగి,
 ఆ కడిగిన నీళ్లను తన శిరస్సు పై జల్లుకొని,
 " ఓ ముని శ్రేష్టా! నేను సంసార మార్గ మందున్న యొక సామాన్య గృహస్తుడను
 నా శక్తి కొలది నేను శ్రీ మన్నారయణుని సేవింతును,
 ద్వాదశి వ్రతము జేసుకోనుచు ప్రజలకు ఎత్తి కీడు రాకుండా ధర్మ వర్తనుడ నై రాజ్య మేలుచున్నాను. 
నా వలన మీకు సంభవించిన కష్టమునకు నన్ను మన్ని౦పుడు. 
మీ యెడల నాకు అమితమైన అనురాగ ముండుట చేతనే తమకు
 ఆతిథ్య మివ్వ వలయునని ఆహ్వానిన్చితిని. కాన, నా అతిధ్యమును స్వీకరించి నన్నును,
 నా వంశమును పావనము జేసి కృ తార్దు ని చేయుడు, మీరు దయార్ద్ర హృదయులు,
 ప్రధమ కోపముతో నన్ను శపించనను మరల నా గృహమునకు విచ్చేసితిరి. 
నేను ధన్యుడ నైతిని.
 మీ రక వలన శ్రీ మహా విష్ణువు యొక్క సుధర్శనమును చూచు భాగ్యము నాకు కలిగినది.
 అందులకు నేను మీ వుపకరమును మరువ లేకున్నాను.
 మహానుభావా! 
నా మన స్సంతో షమచే మిమ్మెట్లు స్తుతింప వలయునో నా నోట పలుకులు రాకున్నవి. 
నా కండ్ల వెంట వచ్చు ఆనంద బాష్పములతో తమ పాదములు కడుగుచున్నాను. 
తమకు యెంత సేవ చేసినను యింకను ఋణ పది యుండును. కాన, ఓ పుణ్య పురుషా!
 నాకు మరల నర జన్మ రాకుండా వుండేతట్లును, సదా, మీ బోటి ముని శ్రేష్ఠుల యందును- 
ఆ శ్రీ మన్నారాయుణుని యందును మనస్సు గల వాడ నై యుండు
 నట్లును నన్నాశిర్విదించు " డని ప్రార్ధించి, 
సహా ప౦క్తి భోజనమునకు దయ చేయుమని ఆహ్వానించెను.
 ఈ విధముగా తన పాదముల పై బడి ప్రార్ధించు చున్న అంబరీషుని 
ఆశీర్వదించి " రాజా! ఎవరు ఎదుటి వారి బాధను నివారణ గావించి ప్రాణములు కాపాడుదురో, 
ఎవరు శత్రువుల కైనను శక్తి కొలది ఉపకారము చేయుదురో అట్టి వారు 
తండ్రితో సమాన మని ధర్మ శాస్త్రములు తెలియ జేయు చున్నవి.
 నివు నాకు యిష్టుడవు తండ్రితో సమానుడ వైనావు.
 నేను నీకు నమస్కరించినచో నా కంటె చిన్న వాడగుట
 వలన నీకు అయుక్షినము కలుగును.
 First    45  46  47  48  49  50  51  52  53  54  55  56  57  58  59  60  61 Last

No comments:

Post a Comment