Wednesday, October 23, 2013

కార్తిక పురాణం 7 (4 వ అధ్యాయము) దీపారాధన మహిమ

4 వ  అధ్యాయము

దీపారాధన మహిమ
ఈ విధముగా వశిష్టుడు కార్తిక మాస వ్రతము యొక్క మహిమ వల్ల బ్రహ్మ రాక్షస జన్మ
 నుండి కూడా విముక్తి నొ౦దెదరని చెప్పుచుండగా జనకుడు 'మహితపస్విత ! 
తమరు తెలియజేయు యితిహాసములు వినిన కొలది తనివి తిరకున్నది.
కార్తీక మాసము ముఖ్యముఘ యేమేమి చేయవలయునో,
 యెవరి నుద్దేశించి పూజ చేయవలయునో వివరింపుడు' అని కోరగా
 వశిష్టుల వారు యిట్లు చెప్పదొడగిరి.
జనకా! కార్తీక మాసమందు సర్వ సత్కార్యములనూ చేయవచ్చును.
 దీపారాధన మందు అతి ముఖ్యము దీని వలన మిగుల ఫలము నొ౦ద వచ్చును. 
 సూర్యాస్తమయ మందు, అనగా, సంధ్య చీకటి పడు సమయమున శివకేశవులు
 సన్నిధినిగాని ప్రాకారంబున౦దు గాని దీపముంచిన వారు సర్వ పాపములను
 పోగొట్టుకొని  వైకుంట ప్రాప్తి నొ౦దుదురు.
 కార్తిక మాసమందు హరి హరాదులు సన్నిధిలో ఆవునేతితో గాని, 
కొబ్బరి నూనెతో గాని, విప్ప నూనెతో గాని, యేది దొరకనప్పుడు  
 అముదముతో గాని దీపము వెలిగించి వుంచవలెను. దీపారాధన యే నూనెతో 
చేసిననూ మిగుల పుణ్యత్ములుగాను, భక్తి పరులగాను  నగుటయేగాక 
 అష్టైశ్వర్యములూ కలిగి శివ సన్నిధి కేగుదురు. ఇందు కొక కథ గలదు, వినుము.

 First   01   1   2   3  4   5    6   7   8    9  10   11  12  13   14   15   16   Last 

No comments:

Post a Comment