కార్తిక మాసం 28
గౌరవిస్తుందా?
ఐహిక సుఖములే గొప్ప సుఖములు కాన,
నా రెండవ కుమార్తెను కూడా నేనడిగినంత ధన
మేవరిత్తురో
వారికే యిచ్చి పెండ్లి చేయుదును కానీ,
కన్య దానము మాత్రము
చేయను' అని నిక్కచిగా నిదివేను.
ఆ మాటలకూ సన్యాసి ఆశ్చర్య పడి తన దారిన
వెడలిపోయెను.
మరి కొన్ని దినములకు సువిరుడు మరణించెను.
వెంటనే యమ భటులు
వచ్చి వానిని తీసుకొనిపోయి,
యమ లోకములో అసి పత్ర వనమును నరక భాగమున పడవేసి
అనేక విధములుగా భాదించిరి. సువిరుని పుర్వికుడై నా శ్రుత కీర్తి యను
రాజు
ధర్మ యుక్తంగా ప్రజలను పాలించి ధర్మాత్ముడై మృతి చెందిన
పిమ్మట స్వర్గ మందు
సర్వ సౌఖ్యములు అనుభవించు చుండెను.
సువిరుడు చేసిన కన్య విక్రయము వలన ఆ
శ్రుత కీర్తిని కూడా యమ
కింకరులు పాశాములతో బంధించి స్వర్గము నుండి
తీసుకోని వచ్చిరి.
అంతటా శ్రుత కీర్తి " నేనెరిగున్నత వరకును ఇతరులకు
ఉపకారము
చేసి ధన ధర్మదులు, యజ్ఞ యాగాదు లోనరించి యున్నాను.
నాకీ దుర్గతి
యేల కలిగె? " నని మనమునందు కొని నిండు కొలువు
దీరి యున్న యమ ధర్మ రాజు కదా
కేగి , నమస్కరించి " ప్రభూ! నీవు సర్వజ్ఞుడవు,
ధరముర్తివి, భుద్ది శాలివి.
ప్రాణ కోటి నంటాను సమ౦గా జూచు చుందువు.
నేనెన్నడూ ఏ పాపమూ చేసి యుండలేదు.
నన్ను స్వర్గము లోకము నుండి నరకమునకు దోడ్కొని
వచ్చుటకు కారణ మేమి?
సెలవిండు' అని ప్రాధేయ పడెను.
అంత యమ ధర్మ రాజు శ్రుత కీర్తిని గాంచి'
శ్రుత కీర్తి! నీవు న్యాయ మూర్తివి,
ధర్మజ్ఞుడవు, ని వెతువంటి దురాచారములూ
చేసి యుండలేదు. అయిన నేమి?
నీ వంశియుడగు సువిరుడు తన జ్యేష్ట పుత్రికను
దానమున కాశించి అమ్ముకోనెను.
కన్య నమ్ముకొనే వారి పూర్వికులు యిటు మూడు
తరముల వారు అటు
మూడు తరముల వారున్ను వరెంతటి పుణ్య పురుషులైనను
నరకమనుభావించుట యే గాక, నిచ జన్మ లెత్త వలసి యుండును.
నీవు పుణ్య త్ముడ
వాణియు ధర్మతుడా వాణియు నేనేగుడును గణ,
నీ కోక ఉపాయము చెప్పెదను.
నీ వంశీ
యుడగు సువిరునకు మరియొక కుమార్తె కలదు.
ఆమె నర్మదా నదీ తీరమున తన తల్లి
వద్ద పెరుగుచూన్నది.
నా యశిర్వా దాము వలన నీవు మనవ శరీరము దాల్చి,
అచటకు
పోయి ఆ కన్యను వేద పండితుడును శిలవంతుడునగు
ఒక విప్రునకు కార్తీక మాసమున
సాల౦కృత కన్య దానము చేయుచు,
యతుల చేసిన యెడల నీవు, నీ పూర్వికులు,
సువిరుడు,
మీ పితృ గణములు కూడా స్వర్గ లోకమున కెగుదురు.
కార్తీక మాసములో
సాల కృత కన్య దమను చేసిన వాడు మహా పుణ్యాత్ముడుగాను.
పుత్రిక సంతానము
లేనువారు తమ ద్రవ్యముతో కన్య దానము చేసినను,
లేక విది విధానముగా అబోతునకు
వివాహ మొనర్చిను కన్య దన ఫలమబ్భును.
కనుక, నీవు వెంటనే భూలోకమున కేగి నేను
తెలిపి నటుల చేసితి వేణి
ఆ ధర్మ కార్యము వలన న పితృ గణము తరిం తుర పోయి
రమ్ము ' అని పలికెను.
శుర్తి
కీర్తి యమునకు నమస్కరించి సెలవు తీసుకోని నర్మదా తీరమున
ఒక పర్ణ కుటిరములో
నివసించు చున్న సువిరుని భార్యను,
కుమార్తెను చూచి, సంతోష పడి, ఆమెతో
యవ్వతి విషయములు వివరించి
కార్తీక మాసమున సువిరుని రెండవ కుమార్తెను
సాలం
కృత కన్య దన వివాహము చేసెను.
యతుల కన్య దానము చేయుట వలన సువిరుడు కూడా పాప
విముక్తుడై స్వర్గ లోకములో నున్న పితృ దేవతలను కలసి కొనెను.
కన్య
దానము వలన మహా పాపములు కూడా నాశన మగును.
వివాహ విషయములో వారకి మాట సహాయము
చేసినను, పుణ్యము కలుగును.
కార్తీక మాసమున కన్యా దానము చెయవలయునని దీక్ష
భుని ఆచరించిన వాడు.
విష్ణు సాన్నిధ్యము పొందును.
శక్తి కలిగి యుండి
వుదసినత చూపు వాడు శాశ్వత నరకమున కేగును.
ఇట్లు స్కాంద పురాణా౦ తర్గత వశిష్ట ప్రోక్త కార్తీక మహాత్య మందలి
No comments:
Post a Comment