దానిని దెచ్చి నీ కిచ్చెదను. దానితో నా భర్తను జంపినన్ను భార్యాగా పరిగ్రహింపుము. అట్లు చేయనిచో వాడే నిన్ను భక్షించుచు" అని పలికెను. ఆ పారుడు, "ఇప్పుడు సవతిని దెచ్చినాడని నీ భర్తను జంపబూనినావు. మరి, నాకిది వరకే ఒక భార్యయున్నది. అందుచేత రేపు నన్నుగూడ చంపవని నమ్మక మేమున్నది? "అని యడుగగా ఆమె" నీవు మానవుడవు. రాక్షసుడవు కావు. అందరను సమముగా జూచు బుద్ద మానవుల కుండును. నిన్నేమియు చేయను. నేను సత్యమే చెప్పుచున్నాను. ఆడిన మాట తప్పినచో, బ్రహ్మహత్యలు, భూమి చౌర్యము, చేసిన వా రెట్టి నరకములకు బోవుదురో నేనును అట్టి దుర్గతికి బోవుదు"నని ప్రమాణములు చేయగా బ్రాహ్మణుడు విశ్వసించి ఆ శక్తిని తెచ్చియిమ్మనెను. ఆమె తెచ్చి యిచ్చెను.
ఇక్కడ గుహలో రాక్షసుడు రాజ కుమారిని, తనను వరింపుమని నిర్భంధించు చుండెను. ఆమె, "నేను కన్యకు. మనకు పెండ్లి కాకుండ సంసారము చేయుటకు ధర్మము లొప్పవు. నన్ను నీవు అపహరించి తెచ్చినావు. ఎక్కడికి పోగలవు? ఇంక నాకు నీవే భర్త వయ్యెడి యోగమున్నదను కొందును. మనము పెండ్లి చేసికొందము.దానికి అగ్ని, నీరు, బ్రాహ్మణుడు కావలెను. ఇన్నియు దొరకనిచో ఒక్క బ్రాహ్మణుడైనను ఉండవలెను గదా! నీ భార్య యీపాటికి చంపకుండ ఉన్నచో ఆ చెట్టు క్రింది బ్రాహ్మణుని తెమ్ము. పెండ్లి తంతు పూర్తి యైన తరువాత వానిని నీవు బుజించ వచ్చును" అని చెప్పగా వాడు
మోహపిశాచి మావహించి యున్నవాడు కావున అట్లే చేయుటకు బయలుదేరెను. వానిని జూచి రక్కసి శక్తిని ప్రయోగింపు మనగా బ్రాహ్మణుడట్లే ప్రయోగించెను. దానితో రక్కసుడు చచ్చెను.
No comments:
Post a Comment