ప్రసిద్ద స్థానాల్లో శివ లింగాలకు ఆరాధన చేయడమే కాకుండా చాల మంది
భక్తులు సాంప్రదాయ కంగా ప్రతి నిత్యం శుద్ధ మైన మట్టితో చేతిలోనే
శివ లింగాన్ని తాయారు చేసికొని పూజిస్తున్నారు.
దీనిని పార్థి వో పాసన లింగ పూజ అంటారు.
సకల కార్య సిద్దికి ఈ పార్థి ప లింగో పాసన శ్రేష్టం అని భక్తుల భావిస్తారు.
శివ బా ణో పాసన:
శివుణ్ణి ఇంద్రాది దేవతలూ, రావణాది రాక్షసులు పూజించారు నర్మదా
నది తీరంలో కుర్చుని పూర్వం బాణాసురుడు తపస్సు చేశాడు.
శివుడు ప్రత్యక్ష౦ కాగానే ఈ పర్వతంలో ఈ నదిలో నివు నాకెప్పుడూ
దర్శనం ఇవ్వాలని కోరాడు బాణుడు అతని కోర్కెను తీర్చడానికి
భగవానుడు గుండ్రని లింగ కృతి గల రాళ్ల రూపంతో మారిపోయాడు.
అందుకే"నర్మదా కె కంకర్ సబ్ శంకర్ " అనే సామెత వచ్చింది.
ఆ లింగాన్ని పరిశీలించి తీసుకోని ఆ లింగముతో బియ్యమును సమానముగా
తూచి మరల బియ్యముతో లింగమును తూచాలి. లింగం తేలికగా వుంటే గృహసులు,బరువుగా ఉంటే సన్యాసులు,
బరువు హెచ్చు తుగుల్ని బట్టి బాణ లింగం అని
(హెచ్చు తగ్గులు లేనిది బాణ లింగం కాదని) గుర్తించి తమ
నివాసానికి తెచ్చుకొని శాస్త్రీయంగా శివుణ్ణి ఆవాహన
చేసుకొని పూజించాలి.
వివిధ ద్రవ్య లింగో పాసన:
గరుడ పురాణంలో అనేక ద్రవ్యాలతో శివ లింగాన్ని చేసుకొని పూజించి
ఆయ ఫలాలు పొంద వచ్చని చెప్పబడింది. గంత లింగం:-
రెండు పాళ్ళు కస్తూరి నలుగు పాళ్ళు చందనం మూడు పాళ్ళు
కుంకుమ కలిపి శివ లింగాన్ని చేసి పూజిస్తే శివ సాయుజ్యం వస్తుంది.
పుష్ప లింగం:- వాసన గల వివిధ పుష్పాలతో లింగం తాయారు
చేసి పూజిస్తే భిమికి రాజ్యాన్ని పొందవచ్చు.
గోశకృ లింగం:- స్వచ్చ ప్రదేశంలో లబ్భించిన కపిల గోవుల పేడతో
శివ లింగం చేసి పూజిస్తే ఐశ్వర్యం కలిగుతుంది.
నాలుక లింగం:- ఇసుక తో లింగం చేసి పూజిస్తే విద్య ధరత్వం తదుపరి
శివ సాయుజ్యం కలుగుతాయి.
No comments:
Post a Comment