సూతుడు నైమిశారణ్యమునకు వచ్చి శౌనకాది మునులకు ఈలింగ పురాణము వినిపించెను.
బ్రహ్మ విష్ణువులు తగవులాడుట
ఈశాన కల్పమునకు ముందు మహా ప్రళయమున లోకములు నశించి ఏక సముద్రము లైనపుడు చతుర్భుజుడైన విష్ణువు ఆ సముద్ర జలము పై నిద్రించుచుండెను. ఆ సమయమున బ్రహ్మ యక్కడికి వచ్చి, " వీడెవడో కాని నాకంటే ముందువచ్చి, సుఖముగా నిద్రించుచున్నాడు. నేను వచ్చి నానని కూడ గుర్తింపకున్నాడనుకొని కోపముతో రెండు దెబ్బలు వేసెను. దానితో విష్ణువు నిద్ర నుండి లేచి, బ్రహ్మను జూచి, "బాలుడు వగుటచేత తెలివిలేక నన్ను గొట్టినావు క్షమించినాను. మహా యోగులు కూడ తెలిసికొనలోని నన్నునీ వెట్లు తెలిసికొందువు?" అనగా బ్రహ్మ రోషించి" నీవు నాకన్న గొప్ప వాడవా? నేనే కదా ఈ సృష్టి నంతను చేయునది? గొప్పలు చెప్పుకొనకు" మనెను. వారిట్లు తగవులాడుచుండగా వారి ముందొక బ్రహ్మండమైన తెజస్సుతో మహాదేవుడు ప్రత్యక్షమై, " మీరిట్లు తగువులాడు టేల? ఇదే మహాలింగము. రమాపతీ ! నీవు వరాహరూపముతో క్రిందికి బోయి మాలమును జూచి రమ్ము. బ్రహ్మదేవా! నీవు హంస రూపముతో పైకి వెళ్ళి లింగాగ్రమును జూచి రమ్ము' అని యిద్దరితో అనగా వారట్లు వేయి సంవత్సరములు ప్రయాణము చేసికూడ మూలమును, అగ్రమును కనుగొన లేక పూర్వ స్థానమునకు వచ్చి తలలు వంచుకొని నిలువ బడిరి. వారిని జూచి పరమేశ్వరుడు, " బ్రహ్మ విష్ణులారా! విచారింపకుడు. మీరిద్దరును మహాత్ములే. ఆది పురుషుడు నైన నా సంకల్పముచే మీరు సృష్టిని, పరిపాలనమును చేయుచుండుడు. నేను సమయాను కూలముగా సంహార కార్యమును నిర్వర్తించెదను " అని వారినొ దార్చెను.
No comments:
Post a Comment