ఆ మద్దుల రూపములో నున్న గంధర్వులకు
శాపవిమోచనము గలిగించెను. గోవులను గాచుటకు బోయి, యమునానది మడుగులో నున్న కాళియుని
మర్దించి అతనిని సముద్రమునకు దరిమివేసి, యమునా జలమును స్నానపానములకు
యోగ్యముగా జేసెను. తాళవనములో బ్రవేశించి ధేనుకాసురుని బలరాముడు
సంహరించి గోపబాలురచే తాటిపండ్లు తినిపించెను. కృష్ణ బలరాములు
ఇట్లు తమ్ము జంపవచ్చిన చాలామంది రక్కసులను జంపిరి. బ్రహ్మ, ఆవుదూడలను, గోపబాలకులను దాచివేయగా కృష్ణుడు
ఒక సంవత్సరము తానే బాలురుగాను, దూడలుగాను రూపెత్తి బ్రహ్మకు
తానేమిటో తెలియజేసెను.
కృష్ణుని జీవిత విశేషములు
కంసుడు ధనుర్యాగము పేరుతో పిలువనంపగా
అక్రూరునితో శ్రీకృష్ణ బలరాములు వెళ్ళిరి. శ్రీకృష్ణుడు కుబ్జ నుండి
గంధాదులు గ్రహించి ఆమెను అనుగ్రహించెను. ధనుస్శాలకు బోయి ధనుస్సు విరచెను.
కంసుని సభాభవనమునకు బోవుచు తనమీదికి వచ్చిన కువలయాపీడమను ఏనుగును
జంపెను. సభలో కృష్ణ బలరాములు చాణూర ముష్టి కులను మల్లవీరులను మట్టి
గరిపించిరి. కృష్ణుడు కంసుని సింహాసనము పైనుండి లాగి పడద్రోసి చంపెను. తాతయైన
ఉగ్రసేనుని రాజుగా చేసెను. దేవకీ వసుదేవులను గౌరవించెను. తానూ అన్నతో గలిసి
సాందీపనియను మునీంద్రుని యెద్ద వేదవేదాంగములు ఒక్కసారి విని
నేర్చుకొనెను. రాజనీతిని ధనుర్వేదమును నేర్చుకొనెను. వీరి ప్రభావమును
జూచి గురువే ఆశ్చర్యపడెను. గురుదక్షిణగా గురుకుమారుని బ్రతికించి తెచ్చి
యిచ్చెను. తనపై దండెత్తిన జరాసంధాదులను చాలాసార్లు ఓడించెను. ధర్మరాజుచేత
రాజసూయము చేయించి ఎదిరించిన రాజులను పాండవుల సహాయమున అణచివేసెను. జరాసంధ
శిశుపాలాదులను వివిదోపాయములచే సంహరించెను.
తన్ను వరించిన భీష్మకుని కుమార్తె
రుక్మిణి నెత్తుకొని వచ్చి పెండ్లాడెను. జాంబవంతుని గెలిచి శ్యమంతకమణిని
దెచ్చి సత్రాజిత్తున కిచ్చి, అతని కుమార్తె యగు సత్యభామను, జాంబవతిని కూడా పెండ్లాడెను.
తరువాత ఇంకను ఐదుగురిని మిత్రవిందాదులను వివాహమాడెను.
ఇంద్రుని కోరికపై నరకాశురుని జంపి, అతని చెరలో నున్న పదియారువేల నూరుగురు
కన్యలను విడిపించి తాను అన్ని రూపములు ధరించి వారిని పరిణయ మాడెను.
ప్రద్యుమ్నుడు
రుక్మిణి కుమారుడు ప్రద్యుమ్నుడు. అతనిని
పుట్టినపుడే శంబరుడను రాక్షసుడెత్తుకొని పోయి చంపనెంచి సముద్రములో
బారవేసెను. అతడు చచ్చెనని సంతోషించెను. కాని ఆ బాలుని ఒకపెద్ద చేప మ్రింగెను.
అయినాను బాలుడు చావలేదు. జాలరులు చేపలు పట్టుచుండగా ఈ చేపవారి వలలో
బడెను. ఈ పెద్ద చెప్పాను వారు తమరాజు శంబరునకు కానుకగా నిచ్చిరి.
రాజునకు మాయావతి అను భార్య కలదు. ఆమె
రాణియైనను ఇంటి పనులు తానే చేసికొనెడిది. ఈ చెప్పాను శంబరుడు లోనికి పంపెను.
చెప్పాను కోయగా బాలకుడు కనబడెను. ఆమె యాశ్చర్యపడుచుండగా నారదుడు అచటికి
వచ్చి, ఈతడు రుక్మిణి కొడుకు. వీనిని నీ మగడు సముద్రములో బారవేయగా చేప
మ్రింగినది. ఇపుడు నీకు దొరికినాడు.
No comments:
Post a Comment