"బ్రహ్మ మానసపుత్రుడు అత్రి. అతని కొడుకు చంద్రుడు. అతని వంశమున భరతుడు పుట్టెను. వాని వంశములో శంతనుడనువానికి భీష్ముడు పుట్టెను. అతడు పెండ్లి చేసికొనలేదు. శంతనునికి సత్యవతియందు చిత్రాంగదుడు, విచిత్రవీర్యుడు అనువారు గూడ పుట్టిరి. చిత్రాంగదుడు ఒక గంధర్వునితో పోరాడి మరణించెను. భీష్ముడు విచిత్ర వీర్యునికి కాశీరాజు కూత్రుండ్రు అంబిక అంబాలిక అనువారిని దెచ్చి పెండ్లి చేసెను. విచిత్రవీర్యుడు క్షయ రోగముతో మరణించగా, సత్యవతి ఆదేశముమీద అంబిక వ్యాసుని వలన ధృతరాష్ట్రుని, అంబాలిక పాండురాజును గనెను. ధృతరాష్ట్రునికి గాంధారి యందు దుర్యోధనాదులు వందమంది కొడుకులు పుట్టిరి. పాండురాజునకు కుంతి, మాద్రి అని ఇద్దరు భార్యలు. అతడు శాపగ్రస్తుడు కాగా, అతని అనుమతితో కుంతి యమధర్మరాజు ప్రసాదమున ధర్మరాజును, వాయు ప్రసాదమున భీముని, ఇంద్ర ప్రసాదమున అర్జునిని గనెను. మాద్రి అశ్వినుల అనుగ్రహమువలన నకుల సహదేవులను గనెను. పాండురాజు మాద్రిని కలియబోయి మరణించెను.
కర్ణుడు, కుంతికి పండ్లి కాక ముందే సూర్యుని వలన పుట్టినవాడు. అతడు దుర్యోధనుడు నాశ్రయించెను. కురుపాండవులు కృపద్రోణుల వద్ద సర్వశాస్త్ర విద్యలు నేర్చుకొనిరి.
దైవ యోగము వలన కురుపాండవుల మధ్య వైరము గలిగెను. దుర్యోధనుడు లక్కయింటిలో బెట్టి పాండవులను దహించెను. పాండవులు తప్పించుకొని ఏకచక్ర పురము చేరిరి. ముని వేషముతో నుండి బకాసురుని జంపి, పాంచాల దేశమునకు బోయిరి. అక్కడ అర్జునుడు, మత్స్య యంత్రమును గొట్టెను. ద్రౌపది పాండవులయిదుగురికి భార్య యయ్యెను.
పాండవులకు ధృతరాష్ట్రుడు అర్ధ రాజ్యము నిచ్చెను. శ్రీ కృష్ణుడు అర్జునునిచే ఖాండవ వనము దహింపజేసెను. అప్పుడే అగ్నివలన అర్జునునకు గాండీవము విల్లును, రథమును లభించెను.
ధర్మరాజు సోదరుల సహాయముతో నలుదిక్కుల రాజులను గెలిచి రాజ సూయము మహావైభావముగా జేసెను. అది చూచినా దుర్యోధనునకు కన్ను కుట్టెను. అతడు శకుని, కర్ణ, దుశ్శాశనుల ప్రోత్సాహముతో ధర్మరాజును బిలిచి, శకునితో మాయాజూద మాడించి రాజ్యమును నపహరించి పాండవులను పండ్రెండేండ్లు వనవాసమును, ఒక యేడు అజ్ఞాత వాసమును చేయుటకు అడవులకు బంపెను. ధర్మరాజు సోదరులతోను, ద్రౌపది తోనూ ద్వాదశ వర్షములు అరణ్యవాసము చేసి, పదమూడవ యేట అజ్ఞాత వాసము చేయుటకు విరాట నగరమునకు వెళ్ళెను. ధర్మరాజు కంకుభట్టయ్యెను. నకుల సహదేవులు అశ్వగోపాలకులైరి. ద్రౌపది సైరంధ్రిగా విరటునిభార్య సుధేష్ణ దగ్గర చేరెను. అక్కడ కీచకుడనువాడు ద్రౌపదిని కామించి వేధించుచుండగా భీముడొకనాటి రాత్రి వానిని గుట్టురట్టు కాకుండా
No comments:
Post a Comment