Friday, August 2, 2013

శ్రీ అగ్ని పురాణము5




అందుచేత ఒక దేవమందిరమును శిలలతోగాని, ఇటుకలతోగాని, కొయ్యతోగాని కనీసము మట్టితో గాని నిర్మించినచో, సర్వపాప విముక్తుడై ప్రతిదుఇనము యజ్ఞము చేసినంత ఫలమును బొందును. దేవాలయము నందలి ఇటుకల నిర్మాణ మెన్ని సంవత్సరములు నిలిచియుండునో అన్ని వేలేండ్లు నిర్మాత స్వర్గలోకములో నుండును. విగ్రహ నిర్మాత విష్ణులోకమును బొందును. ప్రతిష్ట చేసినవారు విష్ణు సాయుజ్యమును బొందుదురు. ఆలయము శిథిలమైనప్పుడు జీర్ణోద్దరణము చేసినవారు గూడ ఇట్టి ఫలములనే పొందుదురు.

దగ్ద యోగములు

1 . ద్వాదశీ భాను (ఆది) వారము దగ్ధ యోగము
2 . ఏకాదశీ సోమవారము గూడ దగ్ధ యోగము
3 . దశమీ మంగళవారము,
4 . తదియా బుధవారము
5 . షష్టీ గురువారము
6 . విదియా శుక్రవారములు దగ్ధ యోగములుగా చెప్పబడినవి. ఈ యోగములలో ఏ పని ప్రారంభించిననూ అది కొనసాగదు.

సప్తమీ ఆదివారమును, విదియా ఆదివారమును, ద్వాదశీ మంగళవారమును, సప్తమీ తృతీయ (తదియ)లతో గూడిన శనివారమును త్రిపుష్కరము లనబడును. ఈ దినములలో లాభము, విజయుము, వృద్ధి, పుత్రజన్మము, నష్టము, భ్రష్టత్వము, నాశనము ఏది జరిగిననూ అది త్రిగుణముగా (మూడు రెట్లు) ఉండును.

నవతారలు - వాని ఫలములు
జన్మ నక్షత్రమునుగాని, నామనక్షత్రమును గాని స్పుటముగా నిర్ణయించుకొని, దాని నుండి లెక్క పెట్టినచో  1.జన్మతార, 2. సంపత్తార , 3. విపత్తార , 4. క్షేమతార , 5. ప్రత్య(రా)క్తార,  6. సాధనతార,  7. నైధనతార,  8. మిత్రతార , 9. పరమమిత్ర తార వచ్చును. నక్షత్రములు 27. తారలు తొమ్మిది. 27/9 = 3 నవకములు. ప్రతీ నవకము (9 ) లోను తారల పేర్లు అవే. ఇంకా వీని ఫలములు.

1 . జన్మతార అన్నింటికి మంచిది కాదు.
2 .  సంపత్తార అన్నింటికి చాలా శ్రేష్టము
3 . విపత్తార మంచి ఫలము నీయదు
4 . క్షేమతార సర్వకార్యము లందును మేలు కలిగించును


First  2  3  4  5  6  7  8  9  10  11  Last

No comments:

Post a Comment