Wednesday, August 7, 2013

శ్రీ లింగ పురాణము2






క్షుప - దధిచులు
పూర్వమొకప్పుడు బ్రహ్మ, దేవతలతో గూడి యుండగా అతని ముక్కులో నొక దోమ దూరెను. దానితో అతనికి పెద్ద తుమ్ము వచ్చెను. ఆ తుమ్ము నుండి ఒక మహా వీరుడు పుట్టెను. క్షుతము(తుమ్ము) నుండి పుట్టిన వాడగుటచే అతనికి క్షుపుడను పేరుగ గలిగెను. బ్రహ్మ అతనిని ఒక రాజ్యమును రాజును జేసెను. అతని మంత్రి దధిచియను విప్రుడు. వారిద్దరును సకల కార్యము లందును ఏక వాక్యత గలిగి రాజ్యమును పాలించుచుండిరి.

ఒక నాడు సభలో బ్రాహ్మణ క్షత్రియులలో నెవరు గొప్పవారను ప్రశ్న పుట్టగాదధీచి, " తపము, వేదము, శమదమాది గుణములు గలిగిన బ్రాహ్మణుడు గొప్పవాడు. రాజులకు బాణ ప్రయోగ శక్తియే ఉండును. బ్రాహ్మణులకు శాపాను గ్రహ శక్తులు రెండును కూడ ఉండెను" అనగా క్షుపునకు కోపము వచ్చి, " నీవు జాతిపక్ష పాతమును చూపి మాట్లాడి నావు. రాజులు పోషించనిచో బ్రాహ్మణులకు తినుటకు కూడేది? నిన్నొక పెద్దగా భావించి ధర్మము చెప్పు మనగా నన్నింత అవమానించెదవా? అనెను. దధిచి" నేను నిజమే చెప్పితిని.

బ్రాహ్మణుడు కోపించినచో దేవేంద్రుడైనను పతన మయ్యెనుగదా! అది గ్రహింపక నన్ను నిండిం చెదవా?" అనుచు రాజు తలమీద ఒక గ్రుద్దును. రాజు కూడ కోపించి చెతనున్న ఖడ్గముతో విప్రుని ఖండించెను. అతడు మరణించుచు శుక్రాచార్యుని స్మరించెను. అతడు వచ్చిమృత సంజీవనితో దధిచిని బ్రతికించి," పరమ తపస్విని. నీకీ రాజసేవ యేల? పరమేశ్వరు నారాధించి ముక్తి  నొందు" మని బోధించి రాజును జూచి" నీవు, బ్రాహ్మణుడే మైన అన్నను సహింపవలెను. అట్లుకాక మదముతో బ్రహ్మ హత్య చేయుటకు సిద్ద పడుదువా? దీని ఫలము అనుభవించ వలెనని కాలితో రాజు తలమీద తన్నెను. క్షుపుడు కోపించి వజ్రముతో నరుకబోగా అది శుక్రుని గుండెను తాకి చూర్ణ మయ్యెను. ఆ పారభవమును సహింపలేక క్షపు డెట్లై నను దధిచిని జంప నిశ్చయించి నారాయణు
నారాధింపసాగెను. శ్రీహరి ప్రత్యక్ష మయ్యెను. క్షుపుడతనిని స్తుతింపగా ఏమి కావలెనని యడిగెను. క్షుపుడు దధిచి వలన తనకు కలిగిన యవమానమును చెప్పినా కోపము దధిచిని శిక్షింపుమని కోరెను.


First   2  3  4  5  6  7  8  9  10  11  12  13  Last

No comments:

Post a Comment