Friday, August 2, 2013

శ్రీ అగ్ని పురాణము4




వధించెను. దుర్యోధనుని తమ్ముల నమ్దరను పదునెనిమిదవ రోజు యుద్ధములో భీముడు చంపివేసెను. తరువాత గదాయుద్ధములో దుర్యోధనుని గూడ చంపివేసెను. ఆ రాత్రి క్రుపకృత వర్మలతో గలిసి అశ్వత్ధామ పాండవ శిబిరములో అందరును నిద్రించుచుండగా, ఉప పాండవులను,  ధృష్టద్యుమ్నుని, గజతురగ సైన్యములను నిర్దాక్షిణ్యముగా చంపివేసెను. అర్జునుడు అశ్వత్ధామను పట్టుకొని ద్రౌపది దగ్గరకు కీడ్చుకొని వచ్చెను. ఆమె పుత్రశోకముతో ఉండికూడా పుత్రులను జంపిన అశ్వత్ధామను విడిపించెను. అశ్వత్ధామ అస్త్రముతో ఉత్తరాగర్భములో చనిపోయిన పరీక్షిత్తును శ్రీకృష్ణుడు తిరిగి బ్రతికించెను.

భారత యుద్ధములో చనిపోక బ్రతికినవారు, కౌరవ పక్షములో అశ్వత్ధామ కృపకృతవర్మలు. పాండవ పక్షములో పాండవులు, సాత్యకి, కృష్ణుడు. ధర్మరాజు, చనిపోయిన బంధువులకు ఉత్తరక్రియలు చేసెను. భీష్ముని వలన అనేక ధర్మములు దెలిసికొనెను. తరువాత అశ్వమేధ యాగము చేసెను. ద్వారకలో యాదవ వంశక్షయమును అర్జునుని ద్వారా విని చాలా విచారించి, రాజ్యమును పరీక్షిత్తునకు ఇచ్చి భార్య ద్రౌపది తోనూ, తమ్ములతోనూ స్వర్గమునకు మహాప్రస్థానము చేసెను. ద్రౌపదియు భీమార్జున నకుల సహదేవులును దారి మధ్యలోపడి మరణించిరి. ఇంద్రుడు పంపిన విమానము మీద మానవదేహముతోనే ఎక్కి ధర్మరాజును, తేజోమయ దేహముతో ద్రౌపదీ భీమార్జున నకుల సహదేవులును స్వర్గము నలంకరించిరి.

దేవాలయ నిర్మాణము - దాని పుణ్యము
ఏ దేవుని కైననూ ఆలయమును నిర్మించినచో కలిగేది పుణ్యము ఇంతింత అని చెప్పలేము. దేవాలయ నిర్మాతలను గూర్చి యముడు తన భటులతో ఇట్లు పలికెను. " కింకులారా! ప్రతిమా (విగ్రహ) పూజలు చేయువారిని నరకమునకు దెచ్చు ప్రయత్నము చేయకుడు. అట్లే దేవాలయమును నిర్మించిన వారి జోలికి గూడ వెళ్ళకూడదు. మంచి చెడ్డలు విచారించి ప్రవర్తింపుడు. జగద్రక్షకుడైన జనార్ధనుని ఆశ్రయించిన వారినిజూచి మీరు దూరము నుండియే తొలగిపొండు. వారికి నరకలోక బాధలు ఉండవు కనుక మీరు వారి వైపు చూడనక్కరలేదు. ఎవ్వరు గోవిందనామస్మరణ చేయుచుందురో వారిని విడిచి దూరముగా నుండుడు. శ్రీకృష్ణుభగవానుని ధూపదీప నైవేద్యాలతో అర్చన చేయువారి యొద్దకు వెళ్ళవలదు. ఆలయమును తుడిచి, నీళ్ళు చల్లి మ్రుగ్గులు పెట్టువారు మహాపుణ్యాత్ములు. వారి జోలికి పోవద్దు. ఆలయనిర్మాణము చేసిన యజమానియే కాదు. దాని నిర్మాణములో పనిచేసిన శిల్పులు కార్మికులు గూడ పుణ్యాత్ములే. మీరు వారి వైపునకు గూడ కన్నెత్తి చూడవలదు. ఇది నాయాజ్ఞ. "


First  2  3  4  5  6  7  8  9  10  11  Last

No comments:

Post a Comment